ఫుల్ పార్సిల్‌తో షాకిచ్చిన నిర్మాత.. ఇంతకీ ఏమైందంటే…?

సినిమాల గురించి, అందులో హీరోల గురించి ట్విటర్‌లో చేసే ట్వీట్లన్నీ ఆయా నిర్మాణ సంస్థలు చూశాయా? కనీసం వాళ్ల ట్వీట్లు కింద పెట్టే రిప్లైలు చూస్తాయా? ఏమో కొన్నిసార్లు చూస్తుంటాయి అనిపిస్తోంది. అచ్చంగా ఇది నిజం అనుకునేలా ఇటీవల ఓ విషయం జరిగింది. పవన్‌ కల్యాణ్‌తో ‘ఓజీ’ సినిమా చేస్తున్న డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ టీమ్‌ చేసిన పని ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది సోషల్‌ మీడియాగా మారింది. అంతగా ఏం చేసింది అనుకుంటున్నారా? జస్ట్‌ ఓ నెటిజన్‌కి రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత అతని కోసం ఓ పార్శిల్‌ పంపించింది అంతే.

రంజాన్‌ సందర్భంగా డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్‌ టీమ్‌ విషెష్‌ చెబుతూ ఓ రెగ్యులర్‌ ట్వీట్‌ చేసింది. అయితే ఆ ట్వీట్‌ కింద ఓ పవన్‌ ఫ్యాన్ ఒకరు ‘ఓజీ’ నుండి బిర్యానీ ప్లాన్‌ చేయ్‌ అని ట్వీట్‌ చేశాడు. దానికి టీమ్‌ నుండి అనూహ్యంగా రిప్లై వచ్చింది. మీ అడ్రెస్‌ డైరెక్ట్‌ మేసేజ్‌ చేయ్‌ అని ఆ ట్వీట్‌లో రాసుకొచ్చింది. ఆ అభిమాని మెసేజ్‌ చేయగా కాసేపటికి అతనికి బిరియానీ పార్శిల్‌ వచ్చింది. ఆ విషయాన్ని మరోసారి ట్వీట్‌ చేశాడు ఆ నెటిజన్‌. దీంతో ఫ్యాన్స్‌ షాక్‌ కమ్‌ ఖుష్ అయ్యారు.

అక్కడికి కాసేపటికే ఆ నెటిజన్‌ మరో ట్వీట్‌ చేశాడు. వేరే రెస్టారెంట్‌ నుండి తనకు మరో పార్శిల్‌ వచ్చిందని అందులో డబుల్‌ కా మీఠా ఉందని రాసుకొచ్చాడు. దీంతో నిజంగా ప్రొడక్షన్‌ హౌస్‌ వాళ్లు పంపించారా అంటూ నెటిజన్లు ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే తొలి ట్వీట్‌తో ఆ నెటిజన్‌ మా పవన్‌ కల్యాణ్‌ను జాగ్రత్తగా చూసుకోండి అని కూడా రాసుకొచ్చాడు. అయితే ఆ ఒక్క నెటిజన్‌కే ఎందుకు పంపించారు..

మాకెందుకు పంపలేదు అని అడుగుతన్నవాళ్లూ ఉన్నారు. ఇక ‘ఓజీ’ సంగతికి కొస్తే.. పవన్‌ కల్యాణ్‌, ప్రియాంక అరుళ్‌ మోహన్‌ కాంబోలో వస్తున్న ఈ సినిమాకు సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ ముంబయిలో జరుగుతోంది.

విరూపాక్ష సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి సాయి ధరమ్ తేజ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

శాకుంతలం పాత్రలో నటించిన హీరోయిన్ లు వీళ్లేనా?
కాంట్రవర్సీ లిస్ట్ లో ఆ సినిమా కూడా ఉందా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus