‘పోకిరి’ చిత్రం నుండే రీ రిలీజ్ ల హవా మొదలైంది. 2022 ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా మహేష్ టీం ‘పోకిరి’ చిత్రాన్ని 4K కి డిజిటలైజ్ చేసి రిలీజ్ చేశారు. ‘పోకిరి’ చిత్రాన్ని థియేటర్లో మిస్ అయిన ప్రేక్షకులంతా ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశారు. తక్కువ థియేటర్లు, తక్కువ షోలతో ఈ సినిమా రీ రిలీజ్ అయినప్పటికీ రూ.1.73 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. అటు తర్వాత తమ పాత చిత్రాలను రీ రిలీజ్ చేసుకోవడానికి చాలా మంది నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించారు.
ఈ క్రమంలో జల్సా, ఆరెంజ్, ఒక్కడు, దేశముదురు వంటి సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. కొన్ని సినిమాలు మంచి వసూళ్లను సాధించడం జరిగింది. ఖుషి, సింహాద్రి వంటి సినిమాలు భారీ కలెక్షన్స్ ను సాధించాయి. అయితే తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది?’ అనే సినిమా కూడా రీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఏకంగా ‘పోకిరి’ ని మించి కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది.
‘ఈ నగరానికి ఏమైంది’ (Ee Nagaraniki Emaindi) సినిమా రీ రిలీజ్ లో ఏకంగా రూ.1.78 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. ‘పెళ్ళి చూపులు’ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. మొదటి రిలీజ్ లో కంటే రీ రిలీజ్ లోనే ఎక్కువ కలెక్ట్ చేసింది అని ట్రేడ్ పండితులు చెబుతున్నారు/ రెండో రోజు కూడా ఈ సినిమాకి బుకింగ్స్ బాగున్నాయి. యూత్ ఎగబడి ఈ చిత్రాన్ని చూస్తున్నారు.
సామజవరగమన సినిమా రివ్యూ & రేటింగ్!
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ మారిన విజయ్ దళిపతి సినిమాలు!