Eega Movie Collections: రాజమౌళి ‘ఈగ’ కి 10 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • July 6, 2022 / 12:17 PM IST

‘మగధీర’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత సునీల్ తో ‘మర్యాద రామన్న’ అనే చిత్రాన్ని చేసాడు దర్శకుడు రాజమౌళి. అది సూపర్ హిట్ అయ్యింది. దాని తర్వాత ‘ఈగ’ అనే మూవీ చేసాడు. నిజానికి ఈ మూవీని ఓ రూ.10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిద్దాం అని అనుకున్నాడు. కానీ ఈ సినిమాకి లభిస్తున్న క్రేజ్ ను చూసి.. గ్రాఫ్ పెంచేసాడు జక్కన్న. ఈ చిత్రాన్ని తమిళ, హిందీ, మలయాళం తెరకెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఒక్క హిందీలో మాత్రం ఈ చిత్రం లేట్ గా రిలీజ్ అయ్యింది. అయినప్పటికీ అన్ని భాషల్లోనూ ఈ చిత్రం సక్సెస్ అందుకుంది. నాని చిన్న పాత్రలో నటించిన ఈ చిత్రంలో సమంత హీరోయిన్ గా నటించగా.. సుదీప్ విలన్ గా నటించాడు. రాజమౌళి డైరెక్షన్ తర్వాత సుదీప్ విలనిజం గురించే ఎక్కువ చెప్పుకోవాలి. అంత బాగా నటించాడు సుదీప్. ఈరోజుతో ఈ చిత్రం విడుదలై 10 ఏళ్ళు పూర్తికావస్తోంది.

మరి బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 12.87 cr
సీడెడ్  5.85 cr
ఉత్తరాంధ్ర  3.19 cr
ఈస్ట్  2.26 cr
వెస్ట్  1.86 cr
గుంటూరు  2.71 cr
కృష్ణా  2.20 cr
నెల్లూరు  1.28 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 32.22 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా   4.68 cr
 ఓవర్సీస్   6.24 cr
తమిళ్ + హిందీ + మలయాళం  14.02 cr
వరల్డ్ వైడ్ (టోటల్)  57.16 cr

 

 

‘ఈగ’ చిత్రానికి రూ.33.61 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి అన్ని భాషల్లోనూ కలుపుకుని వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రూ.57.16 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు రూ.23.55 కోట్ల లాభాలను అందించిందన్న మాట.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus