బిగ్ బాస్ లో అమీతుమీ తేల్చుకోనున్న ఈషా రెబ్బా
- July 5, 2017 / 01:42 PM ISTByFilmy Focus
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లి తెర ఎంట్రీకి అంత సిద్ధమైంది. స్టార్ మా ఛానల్ వాళ్లు నిర్మిస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో లో తారక్ హోస్ట్ గా అలరించనున్నారు. ఈ షోకి సంబందించిన ప్రోమోలలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోతోంది. జులై 16 నుంచి 70 రోజుల పాటు ప్రసారం కానున్న ఈ షోకోసం నిర్వహలు ఓ వైపు ముంబై లోని ఓ స్టూడియోలో పెద్ద సెట్ ని ప్రిపేర్ చేస్తున్నారు. మరోవైపు పార్టిసిపెంట్స్ ని సెలక్షన్స్ చేస్తున్నారు. ఇందులో 12 మంది సెలబ్రిటీలు పాల్గొననున్నారు. వారు వీరే అని అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ వరంగల్ అమ్మాయి ఈషా రెబ్బా సెలక్ట్ అయినట్లు తెలిసింది.
“అంతకుముందు ఆ తర్వాత” సినిమా ద్వారా వెండి తెరకు పరిచయమైన ఈమె అమితుమీ సినిమాతో క్రేజ్ సంపాదించుకుంది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ షోలో సెలక్ట్ అయింది. దాదాపు రోజుకి లక్ష పారితోషకం కూడా అందుకుంటున్నట్లు తెలుగు టీవీ వర్గాల వారు చెబుతున్నారు. ఇక షోలో చివరి వరకు నిలిస్తే బహుమతిగా కోటి సొంతం చేసుకునే అవకాశం ఉంది. పన్నెండు మందిలో ఒకరెవరో తెలిసింది.. మిగిలిన పదకొండుమంది ఎవరో కొన్ని రోజుల్లో బయటికి రానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















