హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ..హిట్టు కళ కనిపిస్తుంది!

‘యువి క్రియేషన్స్’ వారు ‘యూవీ కాన్సెప్ట్స్’ అనే చిన్న బ్యానర్ ను స్థాపించి తక్కువ బడ్జెట్ లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలు నిర్మించడానికి రెడీ అయ్యారు. మొదటి ప్రయత్నంగా దర్శకుడు సంతోష్ శోభన్ ను హీరోగా పెట్టి ‘ఏక్ మినీ కథ’ అనే చిత్రాన్ని రూపొందించారు. డజ్ సైజ్ మేటర్.. అనేది క్యాప్షన్. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ మరియు టీజర్ కు విశేషాదరణ దక్కింది. కార్తీక్ రాపోలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి టాప్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ కథ అందించడం విశేషం.

నిజానికి ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ తో మే 27న అమెజాన్ ప్రైమ్ ఓటిటిలో విడుదల చేయబోతున్నట్టు ఈ మధ్యనే అధికారిక ప్రకటన చేశారు. ఇక ప్రమోషన్లలో భాగంగా.. కొద్దిసేపటి క్రితం ట్రైలర్ ను కూడా విడుదల చేశారు. ఆధ్యంతం ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేలానే ఈ ట్రైలర్ సాగింది. హీరో సంతోష్ శోభన్ అలాగే అతని స్నేహితుడు పాత్రలో చేసిన సుదర్శన్..

మంచి కామెడీని పండించినట్టు స్పష్టమవుతుంది. ఓ బోల్డ్ పాయింట్ ను తీసుకుని.. అందులో కుటుంబ ప్రేక్షకులను అలరించే అంశాలను కూడా దర్శకుడు జోడించినట్టు క్లియర్ గా తెలుస్తుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. గోకుల్ భారతి అందించిన సినిమాటోగ్రఫీ కూడా హైలెట్ గా నిలిచిందని చెప్పొచ్చు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగానే ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :


టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus