‘బిగ్ బాస్ సీజన్ 9’ ముగిసింది. విన్నర్ ఎవరో తేలిపోయింది. ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన కామన్ మెన్ కళ్యాణ్ పడాల టైటిల్ గెలిస్తే, తనూజ గట్టి పోటీ ఇచ్చి రన్నరప్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్ విన్నర్ కాదు.. ఫోర్త్ ప్లేస్‌లో ఎలిమినేట్ అయిన ఇమ్మాన్యుయేల్.అవును, విన్నర్ కళ్యాణ్ పడాలాకి ప్రైజ్ మనీ కింద దక్కింది రూ.35 లక్షలు (డీమన్ పవన్ 15 లక్షలు తీసుకున్నాక).
కానీ, ఇమ్మాన్యుయేల్(Emmanuel) కేవలం తన రెమ్యునరేషన్‌తోనే భారీ మొత్తాన్ని వెనకేసుకున్నాడని ఇన్‌సైడ్ టాక్.ఇన్సైడ్ టాక్ ప్రకారం.. ఇమ్ముకి వారానికి సుమారు రూ.2.50 లక్షల నుంచి రూ.2.60 లక్షల వరకు రెమ్యునరేషన్ ఫిక్స్ చేశారట. ఈ లెక్కన హౌస్‌లో 15 వారాల పాటు కొనసాగిన ఇమ్మాన్యుయేల్.. మొత్తంగా రూ.40 లక్షల వరకు జేబులో వేసుకున్నట్లే అనమాట.

అంటే విన్నర్ చేతికి వచ్చిన ప్రైజ్ మనీ (రూ.35 లక్షలు) కంటే.. ఇమ్ము గెలుచుకున్న రెమ్యునరేషనే ఎక్కువన్నమాట.కేవలం డబ్బు మాత్రమే కాదు, ప్రేక్షకుల ఆదరణలోనూ ఇమ్మాన్యుయేలే టాప్. జబర్దస్త్ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చినా.. ఎమోషన్స్, ఫ్రెండ్‌షిప్, ఎంటర్టైన్మెంట్‌తో 105 రోజులు అలరించాడు. అందుకే ట్రోఫీ రాకపోయినా నెటిజన్లు అతన్ని ‘రియల్ విన్నర్’ అంటూ సోషల్ మీడియాలో ఆకాశానికెత్తేస్తున్నారు.
వాస్తవానికి బిగ్ బాస్ 9 లో సీరియస్ సిట్యుయేషన్స్ ని లైటర్ వేన్ కి చేసి మరీ అలరించింది ఇమ్మాన్యూల్ అనే చెప్పాలి. హోస్ట్ నాగార్జున కూడా ఇమ్మాన్యూల్ ను అడ్డం పెట్టుకుని ఫన్నీ సెటైర్స్ వేసి హౌస్మేట్స్ ను కూల్ చేసేవాడు.
