Emraan Hashmi: గ్రాండ్‌ సీక్వెల్‌లోకి ఇమ్రాన్‌కు వెల్కమ్‌… ఫార్మాలిటీస్‌ వద్దంటూ…!

బాలీవుడ్‌ హీరోలను, నటులను తెలుగులోకి తీసుకురావడం… ఇక్కడ వాళ్లను విలన్‌లుగా చూపించడం ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఒకప్పుడు కూడా ఇలా బాలీవుడ్‌ నటులు తెలుగులో నటించినా అది తక్కువగా ఉండేది. అయితే పాన్‌ ఇండియా సినిమాల ప్రభావం పుణ్యమా అని.. బాలీవుడ్‌ హీరోలు మన దగ్గరకు వస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్‌ ముద్దుల వీరుడు ఇమ్రాన్‌ హష్మీ ఇప్పుడు తెలుగులోకి వచ్చాడు. తొలి సినిమా రాలేదు కానీ.. రెండో సినిమా ఓకే చేసేశాడు.

అడివి శేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జీ 2’. గతంలో వచ్చిన ‘గూఢచారి’ సినిమాకు సీక్వెల్‌గా రూపొందుతున్న చిత్రమిది. ఈ సినిమాలో కీలక పాత్రలో ఇమ్రాన్‌ హష్మి నటిస్తున్న ఇప్పటికే వార్తలొచ్చాయి. తాజాగా ఈ విషయాన్ని అధికారికంగా చిత్రబృందం ప్రకటించింద. ఈ క్రమంలో ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ఈ నేపథ్యంలో అడివి శేష్‌ చేసిన ఓ ట్విటర్‌ పోస్ట్‌, దానికి ఇమ్రాన్‌ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘‘జీ 2 యూనివర్స్‌’లోకి బ్రిలియంట్‌ యాక్టర్‌ ఇమ్రాన్‌ హష్మీకి స్వాగతం. మీతో కలసి నటించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను సర్‌’’ అని శేష్‌ పోస్ట్‌ చేశారు. దీనికి ఇమ్రాన్‌ స్పందిస్తూ ‘‘శేష్‌కు థ్యాంక్స్‌. అలాగే సర్‌ అనే ఫార్మాలిటీస్‌ వద్దు. త్వరలోనే కలుద్దాం’’ రిప్లై ఇచ్చాడు. దీంతో ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇమ్రాన్‌ సింప్లిసిటీకి, వ్యక్తులను డీల్‌ చేసే విధానానికి ఇది నిదర్శనం అని అంటున్నారు నెటిజన్లు.

వినయ్‌కుమార్‌ సిరిగినీడి దర్శకత్వం వహిస్తున్న ‘జీ 2’లో బనితా సంధు హీరోయిన్‌గా నటిస్తోంది. స్పై థ్రిల్లర్‌ జోనర్‌లో పాన్‌ ఇండియా లెవల్‌లో రూపొందుతున్న సినిమా ఇది. ఇక ఇమ్రాన్‌ ఇప్పటికే నటించిన పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’ సినిమా సెప్టెంబరు 27న విడుదల చేస్తామని టీమ్‌ ఇప్పటికే ప్రకటిచింది. ఈ రెండు సినిమాలు వచ్చాక (Emraan Hashmi) ఇమ్రాన్‌ మోస్ట్‌ హ్యాపెనింగ్‌ విలన్‌ ఇన్‌ టాలీవుడ్‌ అవుతారు అని టాక్‌.

ఊరిపేరు భైరవ కోన సినిమా రివ్యూ & రేటింగ్!

‘దయా గాడి దండయాత్ర’ కి 9 ఏళ్ళు!
ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus