ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ రిలీజ్ చేసిన ‘సీటీమార్‌’లోని మాస్ ఫోక్ సాంగ్ `జ్వాలారెడ్డి

ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కుతోన్న భారీ స్పోర్ట్స్ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కి మెలొడిబ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందిస్తున్నారు. భూమిక కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది. ప‌వ‌ర్‌ప్యాక్డ్ పెర్‌ఫామెన్స్‌ల‌తో రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్ కి, పాట‌ల‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. కాగా ఈ మూవీలోని తెలంగాణ ఫొక్ సాంగ్ `జ్వాలారెడ్డి` లిరిక‌ల్ సాంగ్‌ని ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని రిలీజ్ చేశారు.

జ్వాలారెడ్డి.. జ్వాలారెడ్డి.. తెలంగాణ బిడ్డ‌రో..కారాబోంది ల‌డ్డురో..కారాబోంది ల‌డ్డురో ఆడించే క‌బ‌డ్డిరో.. బాలారెడ్డి..బాలారెడ్డి..ఆంధ్రాటీమ్ హెడ్డురో..కోన‌సీమ బ్లెడ్డురో.. కోన‌సీమ బ్లెడ్డురో.. పోర‌డు ఏ టూ జెడ్డురో..అంటూ సాగే ఈ తెలంగాణ మాస్ ఫోక్ సాంగ్‌కి మెలొడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీతం అందించ‌గా శంక‌ర్‌బాబు, మంగ్లీ ఆల‌పించారు. ఈ సాంగ్‌కి సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రిలీజ్‌చేయ‌నున్నారు.

గోపిచంద్‌, త‌మ‌న్నా, భూమిక‌, దిగంగ‌న సూర్య‌వంశి, పోసాని కృష్ణముర‌ళి, రావు ర‌మేష్‌‌, రెహ‌మాన్, బాలీవుడ్ యాక్టర్ త‌రుణ్ అరోరా త‌దిత‌రులు ముఖ్య పాత్ర‌లు పోషిస్తున్న ఈ చిత్రంలో అప్స‌ర రాణి స్పెష‌ల్ సాంగ్‌లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: ఎస్‌. సౌందర్‌ రాజన్‌, సంగీతం: మ‌ణిశ‌ర్మ‌, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, ఆర్ట్‌ డైరెక్టర్‌: సత్యనారాయణ డి.వై, స‌మ‌ర్పణ: పవన్‌ కుమార్, నిర్మాత‌: శ్రీనివాసా చిట్టూరి, కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: సంపత్‌ నంది.


శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus