Enjoy Enjami Song: ఏం పాటరా సామి… 20 కోట్ల మంది వినేశారు

చెవులకు ఇంపుగా వినిపిస్తే చాలు… ఏ భాషకు చెందిన పాటనైనా ఆదరించేస్తారు మన జనాలు. అలా ఎక్కడో దూరదేశం నుండి వచ్చిన ‘గంగ్నమ్‌ స్టైల్‌’నే హిట్‌ చేసేశాం. ‘డిస్పాసీటో’ లాంటి పాటను వినేశాం. అలాంటిది మన పక్క రాష్ట్రంలో రూపొందిన పాటను వదిలేస్తాం. అందుకే తెగ చూసేస్తున్నారు. అంటే ఒక్క మన తెలుగువాళ్లే అని కాదు. మొత్తం ప్రపంచమే చూస్తోంది. దీంతో అప్పుడే 20 కోట్లమందికిపైగా వీక్షించేశారు. ఇంకా ఆ కౌంట్‌ కొనసాగుతోంది. ఇంకీ ఆ పాటేంటో తెలుసుగా… ‘కుక్కూ కుక్కూ…’అంటూ ఊపేస్తున్న ‘ఎంజాయ్‌ ఎంజామీ’. ఇంతకీ ఈ పాట గురించి మీకు తెలుసా?

‘ఎంజాయ్‌ ఎంజామీ’ లో ఎంజాయ్‌ అంటే మనకు తెలిసిందే. ఆనందంగా గడపడం. మరి ఎంజామీ అంటే… మై డియర్‌, నా దేవుడు అని అర్థమట. ఈ పాట రాసిన అరివును తన బామ్మ అలానే పిలిచేదట. ఈ పాటను గాయని దీ అలియాస్‌ దీక్షితా వెంకటేశన్‌ ఆలపించారు. అమిత్‌ కృష్ణన్‌ దర్శకత్వం వహించగా , సంతోష్‌ నారాయణ్‌ నిర్మించారు. అరివు గతంలో ‘కాలా’,‘మాస్టర్‌’ తదితర చిత్రాలకు పాటలు రాశాడు. అయితే ఈ పాట రాయడానికి వెనుక పెద్ద చరిత్రే ఉందట.

అరివు బామ్మ వల్లి అమ్మాళ్‌ గతంలో శ్రీలంకలోని టీఎస్టేట్‌లో నిర్బంధ కార్మికురాలిగా పని చేశారట. అక్కడ ఆమె ఎదుర్కొన్న పరిస్థితులు ఆధారంగా ఈ పాటను రాసుకొచ్చాడు అరివు. ఆంగ్లేయుల తేయాకు తోటల్లో పనిచేసేందుకు భారత్‌ నుంచి తక్కువ వేతనాలకు కూలీలను శ్రీలంకకు తరలించేవారట. అలా ఆమె అక్కడికి వెళ్లారు. కొన్నాళ్లు పనిచేసిన తర్వాత కొందరిని యజమానులు నిలిపివేసేవారు. దీంతో వేరే ఆప్షన్‌ లేక… చిన్న చిన్న పనులు చేసుకుంటూ అక్కడే ఉండిపోయేవారట. ఆ దుర్భర పరిస్థితులకు కళ్లకు కడుతూ ఈ పాట రాసుకొచ్చాడు అరివు.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus