సీనియర్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ కి కొన్నాళ్లుగా హిట్లు లేవు. స్టార్స్ తో పెద్ద సినిమాలు చేసిన కలిసి రాలేదు. ఇప్పుడు స్టార్స్ లేకుండా ఓ చిన్న సినిమా చేశాడు. అదే ‘యుఫోరియా’. ‘రాగిణి గుణ’ సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ చిత్రం నుండి గ్లింప్స్ రిలీజ్ చేసి కథ, కథనాలు ఎలా ఉంటాయి అనేదానిపై ఒక హింట్ ఇచ్చారు. అందులో ఓ అమ్మాయి మెట్రో ట్రైన్లో డ్రగ్స్ తీసుకుని మత్తులో మునిగి తేలడం, ఆ తర్వాత అర్ధరాత్రులు అబ్బాయిల బైక్ రైడ్స్, పబ్బుల్లో అమ్మాయిలతో చిందులు, తర్వాత కారులో కుర్రాళ్లంతా కలిసి ఒక అమ్మాయిని రేప్ చేస్తున్నట్లు చూపించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన టీజర్ తో ఇంకాస్త డెప్త్ ..కి తీసుకెళ్లారు.
మద్యం మత్తులో మునిగి తేలే కుర్రాళ్ళు స్కూల్ స్టూడెంట్స్ అన్నట్టు చూపించారు. ‘ఒక్కడు’ తర్వాత అంటే 22 ఏళ్ళ తర్వాత గుణశేఖర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో భూమిక నటించింది. ఆమెను స్కూల్ ప్రిన్సిపాల్ గా చూపించబోతున్నారు. తన స్కూల్ ను సిటీలో నెంబర్ 1 ప్లేస్ లో నిలిపేందుకు ఆమె దృష్టిపెట్టిన క్రమంలో.. ఆమె కొడుకు భవిష్యత్తుని పట్టించుకోకపోవడం.. తర్వాత ఆమె కొడుకు డ్రగ్స్ కి బానిసై రోడ్ల మీద పడిపోవడం.. తర్వాత ఆమె వెళ్లి మోసుకుంటూ తీసుకురావడం వంటివి విజువల్స్ ని చూపించారు.

అలాగే గౌతమ్ మీనన్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటి సమాజానికి అవసరమైన ఓ మంచి పాయింట్ తో దర్శకుడు గుణశేఖర్ ‘యుఫోరియా తీర్చిదిద్దినట్టు టీజర్ తో క్లారిటీ ఇచ్చారు. సినిమాలో కథనం కూడా ఆకట్టుకునేలా ఉంటే.. ఆయన హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. టీజర్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :
