రెండో రోజు కూడా కోటి షేర్ ను రాబట్టిన శేష్..!

అడివి శేష్ హీరోగా వచ్చిన తాజా చిత్రం ‘ఎవరు’. వెంకట్ రాంజీ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘పీవీపీ సినిమాస్’ బ్యానర్ పై ప్రసాద్ వి పొట్లూరి నిర్మించాడు. ఆగష్టు 15 న విడుదలైన ఈ చిత్రం మొదటి షో తోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. గతేడాది ఆగష్టుకి ‘గూఢచారి’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్టందుకున్న అడివి శేష్.. ఈసారి ‘ఎవరు’ చిత్రంతో కూడా తన ట్యాలెంట్ మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. టీజర్, ట్రైలర్లు చూసినప్పుడే ఈ చిత్రం హిట్టని ఫిక్సయిపోయారు ప్రేక్షకులు. రెజీనా, నవీన్ చంద్ర కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

ఇక ‘ఎవరు’ రెండు రోజుల ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 1.12 కోట్లు
వైజాగ్ – 0.37 కోట్లు
ఈస్ట్ – 0.28 కోట్లు


వెస్ట్ – 0.13 కోట్లు
కృష్ణా – 0.23 కోట్లు
గుంటూరు – 0.20 కోట్లు


నెల్లూరు – 0.07 కోట్లు
సీడెడ్ – 0.30 కోట్లు
————————————————–
ఏపీ + తెలంగాణ – 2.70 కోట్లు(షేర్)
—————————————————-


‘ఎవరు’ చిత్రానికి 10 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం రెండు రోజులకి గాను తెలుగు రాష్ట్రాల నుండీ 2.70 కోట్ల షేర్ ను రాబట్టింది. వరల్డ్ వైడ్ కలెక్షన్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే టోటల్ గా 8 కోట్ల పైనే షేర్ ను రాబట్టాల్సి ఉంది. రెండో రోజు కూడా ఈ చిత్రం కోటి పైనే షేర్ ను రాబట్టడం ట్రేడ్ కు సైతం షాకిచ్చింది. ఇక శని, ఆదివారాల్లో ఈ చిత్రం కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక రెండో వారం కూడా పెద్దగా సినిమాలు లేవు కాబట్టి ఈ చిత్రానికి మరింత కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus