ఓటమి.. ఎవరికీ ఇష్టం లేని పదం. ఇది ఎదురయితే చాలామంది కుంగిపోతారు. తమ పేరు ప్రఖ్యాతలు దెబ్బతింటాయని భయపడతారు. సినిమా రంగంలోనూ అంతే. ఫ్లాప్ వస్తే హీరో రేంజ్ తగ్గిపోతుంది. అవకాశాలు వెనక్కి వెళ్లిపోతాయి. కానీ టాలీవుడ్ లో ఫ్లాప్ కి బెదరని స్టార్స్ కొందరున్నారు. వారి సినిమాలు అపజయం సాధించినా ఏ మాత్రం ఇమేజ్ తగ్గదు. ఫ్లాప్ ప్రభావం ఈ స్టార్స్ పై అసలు కనిపించదు. అటువంటి టాలీవుడ్ హీరోల గురించి ఫోకస్..
సూపర్ స్టార్ కృష్ణసూపర్ స్టార్ కృష్ణ పవర్ ఫుల్ గా నటించిన అల్లూరి సీతారామరాజు లాభాలతో పాటు, మంచి పేరుని తెచ్చిపెట్టింది. అయితే దీని తర్వాత కృష్ణ నటించిన సినిమాలు విజయతీరం చేరుకోలేకపోయాయి. వరుసగా ఏడు ఫ్లాప్స్ చూసారు. ఇన్ని ఫ్లాప్స్ అతనికి అడ్డుకోలేదు. పాడి పంటలు మూవీతో సూపర్ హిట్ కొట్టి ఠాట్ ఈజ్ సూపర్ స్టార్ అని నిరూపించుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి సినిమాతో పవన్ కళ్యాణ్ మొదలెట్టిన జైత్రయాత్ర ఖుషి వరకు నాన్ స్టాప్ గా సాగింది. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న పవన్ ఆ తర్వాత తీసిన సినిమాలన్నీ ఫెయిల్ అవుతూ వచ్చాయి. ఇలా దాదాపు తొమ్మది సినిమాలు బోల్తాకొట్టాయి. అయినా పవన్ క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. పైగా డబల్ అయింది. ఆ సంగతిని గబ్బర్ సింగ్ మూవీ బయటపెట్టింది. పదేళ్లుగా విజయం లేకపోయినా ఇండస్ట్రీలో ఇమేజ్ తరగని హీరో పవన్.
నటసింహ బాలకృష్ణవిజయేంద్ర వర్మ, అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఒక్క మగాడు, పాండురంగడు, మిత్రుడు.. ఇలా వరుసగా ఏడు ఫ్లాప్స్ చూసారు నటసింహ బాలకృష్ణ. ఏడేళ్లపాటు హిట్స్ లేకపోయినా బాలయ్య చేతినిండా సినిమాలున్నాయి. 2010 లో విడుదలయిన సింహా సినిమా బాలకృష్ణ సినీ కెరీర్ స్పీడ్ పెంచింది.
విక్టరీ వెంకటేష్విక్టరీని తన ఇంటిపేరుగా మార్చుకున్న వెంకటేష్ కెరీర్ లో అపజయాల కాలం ఉంది. తులసి సినిమా తర్వాత వచ్చిన సినిమాల్లో నమో వెంకటేశా, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలు కొంతమేరా హిట్ కావడానికి పోరాడిన ఆ జాబితాలో చేరుకోలేకపోయాయి. నాగవల్లి, షాడో, మసాలా సినిమాలు ఫ్లాప్స్ గా మిగిలాయి. అటువంటి సమయంలో దృశ్యం మూవీతో అతని స్టామినాని చాటుకున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టిన నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. సింహాద్రి తో భారీ క్రేజ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్ కి ఆ తర్వాత అపజయాలు వెక్కించాయి. కానీ తారక్ వాటిని అసలు పట్టించుకోలేదు. శక్తి సినిమా నుంచి వరుసగా ఆరు సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ ఆ ప్రభావం ఎన్టీఆర్ పై కొంచెం కూడా పడలేదు. టెంపర్ తో హిట్.. నాన్నకు ప్రేమతో సూపర్ హిట్, జనతా గ్యారేజ్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ఛత్రపతి సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి మంచి హిట్ కర్వు అయింది. దాదాపు ఏడేళ్లుగా ఒక్క విజయం కూడా డార్లింగ్ ఖాతాలో పడలేదు. అయినా అతని ఇమేజ్ చెక్కు చెదరలేదు. మిర్చి మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి అభిమానులను మరింత పెంచుకున్నారు.
ప్రిన్స్ మహేష్ బాబుజాగ్రత్తగా కథలను ఎంచుకునే మహేష్ బాబు పోకిరి వంటి ఇండస్ట్రీ హిట్ సాధించిన తర్వాత మూడు ఫ్లాప్స్ పలకరించాయి. వాటిని చాలా కూల్ గా తీసుకొని దూకుడుతో కలక్షన్స్ తిరగరాశారు. ఇదివరకు ఒక్కడు హిట్ తర్వాత నిజం, నాని, అర్జున్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినప్పటికీ ప్రిన్స్ ఇమేజ్ కి కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. అతడుతో అదరగొట్టేసారు.