ఇటీవల ‘బంగార్రాజు’ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తూ.. ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో నాగార్జునను పలు ప్రశ్నలు అడిగారు విలేకరులు. ఇదే సమయంలో టికెట్ రేట్ ఇష్యూ గురించి కూడా ఆయనకు ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి స్పందించిన నాగ్.. సినిమా స్టేజ్ పై పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడకూడదు.. కాబట్టి నేను మాట్లాడను అంటూ చెప్పుకొచ్చారు. నాగార్జున చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ విషయంలో చాలా మంది నెటిజన్లు నాగ్ ను ట్రోల్ చేస్తున్నారు. గతంలో ఓసారి సినిమా వేదిక మీదే నాగార్జున టికెట్ రేట్స్ గురించి మాట్లాడిన వీడియోను బయటకు తీసి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్లు కొంతమంది రాజమండ్రిలో మీదఁటింగ్ పెట్టుకొని నాగార్జున వ్యాఖ్యలను ఖండించినట్లు తెలుస్తోంది. సినిమా టికెట్ రేట్ల విషయంలో తన అభిప్రాయాలను నాగార్జున మరింత క్లారిటీగా చెప్పాలని వారు కోరుతున్నట్లు తెలుస్తోంది.
మరో ఒకట్రెండు రోజుల్లో కాకినాడలో సమావేశమై ఈ విషయం చర్చించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఒకవేళ నాగార్జున వైపు నుంచి రెస్పాన్స్ రాకపోతే థియేటర్లు మూసేసి నిరసన తెలపాలని కొందరు ఎగ్జిబిటర్లు సమావేశంలో సూచించినట్లు తెలుస్తోంది. అదే గనుక జరిగితే ‘బంగార్రాజు’ సినిమాపై ఎఫెక్ట్ తప్పదనిపిస్తోంది. సంక్రాంతి రేసులో అన్ని సినిమాలు ఒక్కొక్కటిగా తప్పకుంటూ ఉండగా.. నాగార్జున మాత్రం తన సినిమాను రిలీజ్ చేయడానికి ముందుకొచ్చారు. టికెట్ రేట్స్ తగ్గినా.. తన సినిమాకి ఎలాంటి సమస్య లేదని ఆయన చెప్పడం ఆశ్చర్యకరం.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!