ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకున్న విధంగా సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఫస్ట్ వీకెండ్ వరకు ఈ సినిమాకు టికెట్స్ దొరకడం కష్టమని తేలిపోయింది. బాహుబలి2 మూవీని తలపించేలా సలార్2 ఉండబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. సలార్1 సినిమాలో శృతి హాసన్ పాత్ర దేవా ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకునే క్రమంలో ఆమెను ఎన్నో సందేహాలు వెంటాడతాయి. సలార్1 సినిమాను చూసిన ప్రేక్షకులను సైతం అవే సందేహాలు వెంటాడుతున్నాయి.
సలార్2 శౌర్యాంగ పర్వం సినిమాలో దేవా వరద రాజమన్నార్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడా? లేదా తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని గుర్తు పెట్టుకుని కుర్చీ కావాలని కోరుకుంటాడా? దేవా, వరద మధ్య గొడవకు కారణమేంటి? ఆ టాటూ యొక్క రహస్యం ఏంటి? ఆ టాటూ వెనుక ఉన్న నిబంధనలు ఏంటి? ఇలా ఎన్నో ప్రశ్నలకు సలార్2 మూవీ సమాధానం కానుంది. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే ప్రశ్న బాహుబలి రిలీజైన తర్వాత ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేస్తే సలార్ లో అలాంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి.
ఆద్య తండ్రి పాత్రకు సంబంధించిన సందేహాలకు సైతం సలార్2 లో సమాధానం దొరకనుంది. బాహుబలి2 మూవీని తలపించేలా సలార్2 ఉండబోతుందని సలార్2 లో యుద్ధ సన్నివేశాలు సైతం ఉండే అవకాశం ఉందని ప్రశాంత్ నీల్ చెప్పకనే చెప్పేశారు. ఇప్పటికే చూసిన ప్రేక్షకులకు సైతం మళ్లీమళ్లీ చూడాలనిపించేలా సలార్1 ఉంది. ఓటీటీలో సైతం ఈ సినిమా పెద్ద హిట్ గా నిలిచే ఛాన్స్ అయితే ఉంది. ప్రభాస్ ను సరిగ్గా వాడుకుంటే ఏ రేంజ్ హిట్లను సాధించవచ్చో సలార్ మరోసారి ప్రూవ్ చేస్తుందని చెప్పవచ్చు.
ఖాన్సార్ సామ్రాజ్యంలో దేవా పాత్రకు సంబంధించి వచ్చిన ట్విస్టులు సైతం ఆకట్టుకున్నాయి. దేవా, వరద రాజమన్నార్ శత్రుత్వాన్ని సైతం పార్ట్1 లో చూపిస్తారని ప్రేక్షకులు భావించినా ఆ ప్రశ్నలకు కొంతమేర క్లారిటీతోనే సినిమాను ముగించారు. దేవా, వరద రాజమన్నార్ తలపడితే ఎలా ఉండబోతుందో సలార్2 సినిమాలో చూపించనున్నారు. సినిమాలో ఎన్నో చిక్కుముడులను మిగిల్చిన ప్రశాంత్ నీల్ సలార్2 (Salaar2) సినిమాను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారో చూడాలి.
సలార్ సినిమా రివ్యూ & రేటింగ్!
డంకీ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిల్లా- రంగా’ టు ‘సలార్’… ఫ్రెండ్షిప్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన 10 సినిమాల లిస్ట్..!