సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్, రష్మిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యానిమల్ సినిమాపై ఏ రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా ఆంధ్ర ఏరియా హక్కులు 6 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి. అర్జున్ రెడ్డి డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా కావడంతో ఈ సినిమా దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మరోవైపు ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.
యానిమల్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ రణ్ బీర్ ను ఇలా చూపిస్తే ప్రభాస్ ను ఎలా చూపిస్తాడో? అంటూ కామెంట్లు చేస్తున్నారు. స్పిరిట్ మూవీ కచ్చితంగా నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని అభిమానులు భావిస్తున్నారు. యానిమల్ రిలీజ్ తర్వాత సందీప్ రేంజ్ డైరెక్టర్ గా ఎన్నో మెట్లు పైకి ఎదుగుతారని అభిమానులు ఫీలవుతున్నారు.
ప్రభాస్ త్వరలో స్పిరిట్ (Spirit) మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారని సమాచారం అందుతోంది. ఒకింత భారీ బడ్జెట్ తో స్పిరిట్ మూవీ తెరకెక్కుతుందని తెలుస్తోంది. యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో స్పిరిట్ మూవీ గురించి మరింత క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. యానిమల్ సినిమా ఏకంగా 3 గంటల 21 నిమిషాల 23 సెకన్ల నిడివితో థియేటర్లలో విడుదలవుతోంది.
ఈ రన్ టైమ్ ను డీకోడ్ చేస్తే సినిమా ఎక్కడ మొదలైందో అక్కడే ముగుస్తుందనే అనే అర్థం వస్తుందని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. స్పిరిట్ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ హిట్ కావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2025 సంవత్సరంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉంది. సందీప్ రెడ్డి వంగా కెరీర్ ప్లానింగ్ మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.