Unstoppable with NBK: అన్ స్టాపబుల్ షోపై పెరుగుతున్న అంచనాలు.. అలా చేయాల్సిందే!

బాలయ్య  (Balakrishna)  హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్ షో (Unstoppable with NBK) ఏ స్థాయిలో సక్సెస్ సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో సీజన్1, సీజన్2 ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించాయి. అన్ స్టాపబుల్ సీజన్3 లిమిటెడ్ ఎడిషన్ అహా ఓటీటీలో ప్రసారమైంది. త్వరలో ప్రసారం కానున్న సీజన్ ను అన్ స్టాపబుల్3 అనాలో లేక అన్ స్టాపబుల్4 అనాలో అనే కన్ఫ్యూజన్ సోషల్ మీడియాలో కొనసాగుతోంది. అయితే ఈ షోకు చిరంజీవి (Chiranjeevi)   హాజరు కానున్నారనే వార్త ఫ్యాన్స్ కు ఎంతో సంతోషాన్ని కలిగించింది.

Unstoppable with NBK

అయితే ఇదే షోకు నాగ్  (Nagarjuna) , తారక్ (Jr NTR)   కూడా రావాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దేవర  (Devara) మూవీ త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. బాలయ్య, తారక్ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. ఈ హీరోల మధ్య గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతున్నా ఇద్దరు హీరోలలో ఎవరో ఒకరు చొరవ తీసుకుంటే ఆ గ్యాప్ తొలగిపోతుందని చెప్పడంలో సందేహం అక్కర్లేదు.

అన్ స్టాపబుల్ షో క్లిక్ అయ్యి ప్రేక్షకుల మెప్పు పొందాలంటే మాత్రం క్రేజీ హీరోలు ఈ షోకు హాజరు కావాల్సిందేనని చెప్పవచ్చు. ఈ షోకు నాగార్జున హాజరైతే చైతన్య శోభిత పెళ్లి గురించి కీలక విషయాలను పంచుకునే అవకాశాలు ఉన్నాయి. చైతన్య నటిస్తున్న తండేల్ మూవీ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది.


అన్ స్టాపబుల్ షోలో రామ్ చరణ్ (Ram Charan) , మరి కొందరు హీరోలను సైతం చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అన్ స్టాపబుల్ షో హిట్ కావడానికి ఉన్న ఏ అవకాశాన్ని కూడా ఆహా నిర్వాహకులు వదులుకోవద్దని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ షో క్లిక్ అయితే నందమూరి అభిమానులు సైతం ఎంతో సంతోషించే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 నిహారిక దశ తిరిగినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus