Ranbir, Alia: కొత్త జంటకు రణబీర్ తల్లి ఖరీదైన బహుమతి!

  • April 21, 2022 / 09:51 AM IST

చాలా కాలంగా రిలేషన్ లో ఉన్న బాలీవుడ్ లవ్ బర్డ్స్ అలియాభట్ – రణబీర్ కపూర్ లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. ఏప్రిల్ 14న వీరి వివాహం జరిగింది. కేవలం కుటుంబసభ్యులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. అయితే వీరి వివాహానికి కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. మరికొందరు సెలబ్రిటీలు హాజరు కాకపోయినా.. ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ దీపికా పదుకోన్, కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా, ఇతర స్టార్స్ ఖరీదైన బహుమతులు పంపించారట.

Click Here To Watch NOW

ఇదిలా ఉండగా.. రణబీర్ కపూర్ తల్లి నీతూకపూర్ తన కొడుకు-కోడలికి ఖరీదైన ఫ్లాట్ ను కానుకగా ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముంబైలో ఓ విలాసవంతమైన అపార్ట్మెంట్ లో అలియా-రణబీర్ ల కోసం ఆరు బెడ్ రూమ్ ఫ్లాట్ ను బహూకరించినట్లు సమాచారం. దీని ఖరీదు దాదాపు రూ.26కోట్లు ఉంటుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. అయితే రణబీర్ మాజీ ప్రేయసి, హీరోయిన్ కత్రినా కైఫ్ అలియాకు రూ.14.5 లక్షల విలువ చేసే ప్లాటినమ్ బ్రాస్‌లెట్‌ను కానుకగా పంపించిందట.

అలానే దీపికా తన సొంత బ్రాండ్ చోపార్డ్ ఉంచి ఈ కొత్త జంటకు రూ.15 లక్షలు విలువ చేసే కపుల్ వాచ్ ఇవ్వగా.. స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా.. అలియాకు రూ.9 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్‌ను బహుమతిగా ఇచ్చిందట. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా.. అలియాకు రూ.3 లక్షల విలువ చేసే హ్యాండ్‌బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుణ్ ధావన్.. అలియాకు రూ. 4 లక్షల గూచీ హై హీల్ చెప్పులను గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇక అర్జున్ కపూర్.. తన ఫ్రెండ్ రణబీర్ కపూర్ కు గూచీ జిప్పర్ జాకెట్‌ను బహుమతిగా ఇచ్చాడు. దాని విలువ రూ. 1.5 లక్షలు.

1

2

3

4

5

6

7

8

9

10

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus