Pushpa Movie Song : పర్వాలేదనిపించిన ‘పుష్ప’ ఫోర్త్ సింగిల్..!

అల్లు అర్జున్- సుకుమార్ ల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి.డిసెంబర్ 17న విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ తో పాటు మూడు పాటలని కూడా విడుదల చేశారు. అవన్నీ సూపర్ హిట్టే.తాజాగా 4వ పాటని కూడా విడుదల చేశారు. ‘ఏ బిడ్డా ఇది నా అడ్డా’ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు ఇటీవల మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దానికి సంబందించిన ప్రోమోని కూడా విడుదల చేశారు. ఇక ఫుల్ సాంగ్ ను ఈరోజు(నవంబర్ 19న) ఉదయం 11: 07 నిమిషాలకు విడుదల చేశారు.

‘ఆ పక్కా నాదే.. ఈ పక్కా నాదే,
తల పైన ఆకాశం ముక్కా నాదే,
ఆ తప్పు నేనే ఈ ఒప్పు నేనే,
తప్పొప్పులు తగలెట్టే నిప్పు నేనే,
నన్నైతే కొట్టేటోడు భూమ్మీద పుట్టలేదు
పుట్టదా అది మల్లా నేనే
నను మించి ఎదిగేటోడు


ఇంకోడు ఉన్నాడు సూడు
ఎవడంటే అది రేపటి నేనే
నే తిప్పనా మీసమట
సేతీలోన గొడ్డలట
సేసిందే యుద్దమట
సెయ్యందే సంధి అట..
ఏ బిడ్డ ఇది నా అడ్డా’

……. అంటూ సింగర్ నకాష్ అజీజ్ ఈ పాటని ఎంతో జోష్ తో పాడాడు. చంద్రబోస్ అందించిన లిరిక్స్.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ బాగున్నాయి. సినిమాలో పుష్పరాజ్ రైజ్ అవుతున్న టైములో వచ్చే ఎలివేషన్ సాంగ్ ఇది అని లిరిక్స్ ను బట్టి స్పష్టమవుతుంది. పాట బాగానే ఉంది మీరు కూడా ఓసారి వినెయ్యండి :

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!


ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus