వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. 2019 లో వచ్చిన ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. సోనాల్ చౌహాన్ ,మురళీ శర్మ, సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో మొదటినుండీ ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మే 27న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీక్ మంచి కలెక్షన్లను రాబట్టింది.రెండో వీకెండ్ కు మేజర్,విక్రమ్ ల ఎంట్రీతో చాల వరకు డౌన్ అయ్యాయి అయినా పర్వాలేదు అనిపించింది. ‘ఎఫ్ 3’ 10 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం | 17.18 cr |
సీడెడ్ | 5.68 cr |
ఉత్తరాంధ్ర | 5.54 cr |
ఈస్ట్ | 3.13 cr |
వెస్ట్ | 2.36 cr |
గుంటూరు | 3.10 cr |
కృష్ణా | 2.70 cr |
నెల్లూరు | 1.69 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 41.38 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.85 cr |
ఓవర్సీస్ | 6.95 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 51.18 cr |
‘ఎఫ్3’ మూవీకి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.51.18 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.12.82 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పోటీగా ‘మేజర్’ ‘విక్రమ్’ వంటి క్రేజీ సినిమాలు విడుదలవడంతో ‘ఎఫ్3’ కలెక్షన్లు తగ్గాయి. నిన్న పర్వాలేదు అనిపించింది కానీ ఎక్కువగా అయితే క్యాష్ చేసుకోలేకపోయింది.
Most Recommended Video
విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!