వెంకటేష్, వరుణ్ తేజ్ లు హీరోలుగా తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్3’. 2019 లో వచ్చిన ‘ఎఫ్2’ కి సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని ‘శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్’ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ లు నిర్మించారు. సోనాల్ చౌహాన్ ,మురళీ శర్మ, సునీల్, అలీ, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ క్యాస్టింగ్ కూడా ఉండడంతో మొదటినుండీ ఈ మూవీ పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక మే 27న విడుదలైన ఈ మూవీ మొదటి షోతోనే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్ మంచి కలెక్షన్లను సాధించింది.వీక్ డేస్ లో కూడా ఈ మూవీ సూపర్ స్ట్రాంగ్ గా రన్ అవుతుంది. ‘ఎఫ్ 3’ 6 డేస్ కలెక్షన్స్ ను ఓసారి గమనిస్తే :
నైజాం | 15.79 cr |
సీడెడ్ | 5.04 cr |
ఉత్తరాంధ్ర | 4.82 cr |
ఈస్ట్ | 2.62 cr |
వెస్ట్ | 2.03 cr |
గుంటూరు | 2.70 cr |
కృష్ణా | 2.37 cr |
నెల్లూరు | 1.50 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 36.87 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 2.55 cr |
ఓవర్సీస్ | 6.55 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 45.97 cr |
‘ఎఫ్3’ మూవీకి రూ.63.82 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కు రూ.64 కోట్ల షేర్ ను రాబట్టాలి. 6 రోజులు పూర్తయ్యేసరికి ఈ మూవీ రూ.45.97 కోట్ల షేర్ ను రాబట్టింది. వెంకటేష్, వరుణ్ తేజ్ కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్. అయితే బ్రేక్ ఈవెన్ కు ఈ మూవీ రూ.18.03 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.బుధవారం రోజున కూడా ఈ మూవీ రూ.2 కోట్ల పైనే షేర్ ను కలెక్ట్ చేసింది.
Most Recommended Video
పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!