F3 Movie: ఎఫ్3 మూవీ బుకింగ్స్ అలా ఉన్నాయా?

ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో సినిమాలను చూసే ప్రేక్షకుల సంఖ్య గణనీయంగా తగ్గిందనే సంగతి తెలిసిందే. సినిమాలకు హిట్ టాక్ వస్తే మాత్రమే ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కిన ఎఫ్3 సినిమా మరో 48 గంటల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే రిలీజైన ఎఫ్3 ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి, దిల్ రాజు, వెంకటేష్, వరుణ్ తేజ్ వరుసగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటూ

ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి తమ వంతు కృషి చేశారు. అయితే హైదరాబాద్ మినహా తెలుగు రాష్ట్రాల్లోని మరే ప్రాంతంలో ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బుకింగ్స్ లేవు. ఉదయం 8 గంటల నుంచి ఎఫ్3 సినిమా థియేటర్లలో ప్రదర్శితం కానున్నా తొలిరోజు ఈ సినిమాకు సులభంగానే టికెట్లు దొరికే పరిస్థితి ఏర్పడుతోంది. బెంగళూరులాంటి ప్రముఖ నగరాలలో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు.

వరుస విజయాల డైరెక్టర్ అనిల్ రావిపూడి సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాకు బుకింగ్స్ ఈ విధంగా ఉండటం ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. అయితే హిట్ టాక్ వస్తే మాత్రం ఈ సినిమా బుకింగ్స్, కలెక్షన్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. బాక్సాఫీస్ వద్ద మరే సినిమా నుంచి పోటీ లేకపోవడం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది. వెంకటేష్ గత సినిమాలు నారప్ప, దృశ్యం2 ఓటీటీలో విడుదలై సక్సెస్ సాధించాయి.

ఎఫ్3 సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తోనే తెరకెక్కించారని తెలుస్తోంది. ఎఫ్3 సినిమాతో వెంకీ ఖాతాలో మరో సక్సెస్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కెరీర్ విషయంలో వెంకటేష్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. వెంకటేష్ కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. వెంకటేష్ వెబ్ సిరీస్ లపై, బాలీవుడ్ ప్రాజెక్ట్ లపై దృష్టి పెడుతున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus