F3 Movie: ఎఫ్3 సినిమాకు ఆ సీన్లు హైలెట్ కానున్నాయా?

వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎఫ్3 సినిమా మరో నాలుగు రోజుల్లో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. సాధారణ టికెట్ రేట్లతోనే ఈ సినిమా ప్రదర్శితం కానున్నా ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఆశించిన స్థాయిలో లేవని తెలుస్తోంది. రిలీజ్ కు నాలుగు రోజుల సమయం ఉండటంతో రిలీజ్ సమయానికి బుకింగ్స్ పుంజుకుంటాయేమో చూడాలి. ఏఎంబీ సినిమాస్ , భ్రమరాంభ థియేటర్లలో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి.

అయితే తాజాగా ఈ సినిమా సెన్సార్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ స్టైల్ లో ఎఫ్3 సినిమా ఉండబోతుందని సమాచారం. నిర్మాత దిల్ రాజు, అనిల్ రావిపూడి ఎఫ్3 హీరోలు, హీరోయిన్లు వరుసగా ఇంటర్వ్యూలలో పాల్గొంటూ ఈ సినిమాపై అంచనాలను పెంచేశారు. సెన్సార్ సభ్యులు చెబుతున్న వివరాల ప్రకారం లాజిక్ ను వదిలేసి ఈ సినిమాను చూస్తే ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చేలా ఈ సినిమా ఉండనుందని బోగట్టా. ఫస్టాఫ్ అంతా ప్రేక్షకుల పొట్ట చెక్కలయ్యేలా కామెడీ ఉంటుందని సమాచారం.

సినిమాలో అయిదారు కామెడీ బ్లాక్ లు అద్భుతంగా ఉన్నాయని తెలుస్తోంది. సెకండాఫ్ లో తమన్నా, సోనాలి చౌహాన్ కాంబినేషన్ సీన్లు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయని సమాచారం. ఎఫ్3 సినిమాతో అనిల్ రావిపూడి ఖాతాలో మరో హిట్ ఖాయమని తెలుస్తోంది. దిల్ రాజు ఈ సినిమాతో కమర్షియల్ గా మరో సక్సెస్ ను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

భారీ బడ్జెట్ తో ఎఫ్3 సినిమా తెరకెక్కగా ఈ సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. కొన్ని ఏరియాలలో మాత్రం దిల్ రాజు సొంతంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus