cగుర్తుందా? ఆయన వీడియోలు చెప్పిన మాటలు విని.. హమ్మయ్య కుటుంబంతో సహా సినిమా చూడొచ్చు అనుకుంటున్న వారికి గుండెల మీద బండరాయి పడే విషయం మీకు ఇప్పుడు చెప్పబోతున్నాం. సాధారణ టికెట్ ధరలు అంటే సాధారణం కాదు.. దాని కంటే కొంచెం ఎక్కువ, అసాధారణం కంటే కొంచెం తక్కువ అని చెప్పొచ్చు.
ఏంటీ.. కన్‌ఫ్యూజ్‌గా ఉందా? ఒకసారి ఆన్‌లైన్‌లో ‘ఎఫ్ 3’ సినిమా టికెట్ బుక్ చేయాలని చూస్తే మీకు విషయం అర్థమైపోతుంది. అది కూడా ఓ విధంగా కష్టమే అని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో సాధౄరణ టికెట్ ధర ఎంత అనేది సగటు సినిమా ప్రేక్షకుడు మరచిపోయి చాలా రోజులైంది. టికెట్ రేట్లు జీవోలు వచ్చి, అర్థమయ్యేలోగా ధరలు మార్చేశారు. ఒక్కో సినిమాకు ఒక్కోలా ధరలు కనిపిస్తున్నాయి. కాబట్టి రీసెంట్‌గా విడుదలైన సాధారణ సినిమాతో టికెట్ రేట్లు పోల్చుదాం.
గత వారంలో డబ్బింగ్ సినిమా ‘డాన్’ విడుదలైంది. గుర్తుంది కదా. ఈ సినిమాకు నగర శివారులోని శ్రీలత థియేటర్‌లో టికెట్ రేటు రూ. 150. త్వరలో అదే థియేటర్‌లో ‘ఎఫ్ 3’ సినిమా విడుదల చేయబోతున్నారు. అప్పుడు టికెట్ ధర రూ. 175 కాబోతోంది. ఈ లెక్కన టికెట్ మీద రూ. 25 ఎక్కువగా వసూలు చేస్తున్నారన్నమాట. ఇది ఏ విధంగా సాధారణ రేటు అనేది దిల్ రాజునే చెప్పాలి. ఇది ఒక థియేటర్ లెక్కనే. నగరంలో చాలా థియేటర్లలో లెక్కలు చూడాలి.
ఇక మల్టీప్లెక్స్‌ల సంగతి చూద్దాం. పైన చెప్పిన సినిమా గురించే ఈ లెక్కంతా వేద్దాం. ఈ సారి నగరం నడిబొడ్డున ఉన్న ప్రసాద్ ఐమ్యాక్స్‌లో టికెట్ ధరలు చూద్దాం. ‘డాన్’ సినిమాకు ఇప్పుడు ఐమ్యాక్స్‌లో రూ. 200 వసూలు చేస్తున్నారు. కానీ ‘ఎఫ్ 3’కి రూ. 295 తీసుకుంటున్నారు. ఈ లెక్కన ఇక్కడ రూ.95 అధికం తీసుకుంటున్నారన్నమాట. దీన్ని కూడా సాధారణం అనాలా అనేదే నెటిజన్ల ప్రశ్న. అన్నట్లు పైన చెప్పిన రేట్లకు ట్యాక్స్‌లు అధికం అని మరచిపోవద్దు. ఆ లెక్కన మేం చెప్పిన్నట్లు అన్ని ‘సాధారణాలు’ ఒక్కటే కావు. ఒక్కో సాధారణం ఒక్కోలా ఉంటుంది.
Most Recommended Video
‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!