F3 Twitter Review: ఎఫ్3 సినిమాకి మళ్ళీ అలాంటి నెగిటివ్ టాక్.. కానీ..!

F 2 సినిమా కు ఫ్రాంచైజ్ గా తెరకెక్కిన F3 సినిమా నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ వెంకటేష్ హీరోలుగా నటించగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో తెలియజేసింది. ఇక

ఈ సినిమా కు సంబంధించిన ప్రీమియర్స్ ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రదర్శించడం జరిగింది. ఇక సినిమాను చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో ఈ విధంగా స్పందిస్తున్నారు. సినిమాలో వెంకటేష్ కామెడీ తో మరోసారి అదరగొట్టేశాడు అని వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది అని చెబుతున్నారు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సీక్వెన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి అని అయితే అక్కడ అక్కడ మాత్రం చిరాకు తెప్పించే కామెడీ సన్నివేశాలు కూడా ఉన్నాయి అని చెబుతున్నారు.

అయితే వెంకటేష్ రేచీకటి లో వచ్చే కామెడీ సన్నివేశాలు అలాగే అతనితో పాటు వరుణ్ తేజ్ కూడా నత్తి తో మాట్లాడడం హైలెట్ గా నిలిచాయి అని మొత్తానికి ఫస్టాఫ్ మాత్రం ఆడియన్స్ కు ఫన్ రైడ్ లా ఉంటుంది అని చెబుతున్నారు. సెకండాఫ్ మాత్రం కామెడీ డోస్ ఎక్కువ కావడంతో ఆడియన్స్ పూర్తి స్థాయిలో సంతృప్తి చెందలేదు అనే విధంగా కూడా చెబుతున్నారు.

ఒక విధంగా F2 సినిమా కంటే కూడా F3 సినిమా బెటర్ అని కామెంట్స్ కూడా వస్తూ ఉన్నాయి. కొందరు అయితే ఈ సినిమాపై పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా జానర్ ను బట్టి ఎంజాయ్ చేయగలిగితే బావుంటుంది అని అంటున్నారు. మొత్తానికి ఈ సినిమాకు అనుకున్నట్లుగానే F2 తరహాలోనే కొన్ని నెగటివ్ కామెంట్స్ వస్తున్నప్పటికీ కూడా ఈ సినిమానో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఫైనల్ గా ఈ సినిమాతో నిర్మాత దిల్ రాజు ఏ స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తాడో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus