Naresh,Pavitra : పవిత్ర నరేష్ పెళ్లి వార్తల్లో వాస్తవాలు ఇవే!

గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో పవిత్ర లోకేష్, సీనియర్ నరేష్ ప్రేమలో ఉన్నారని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. వీళ్లిద్దరికీ ఇప్పటికే రహస్యంగా పెళ్లి జరిగిందని కూడా కామెంట్లు వ్యక్తమయ్యాయి. వైరల్ అయిన ఈ వార్తలపై కొంతమంది నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తే మరి కొందరు నెటిజన్లు నెగిటివ్ గా కామెంట్లు చేశారు. మహాబలేశ్వరంలో కలిసి కనిపించినంత మాత్రాన ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకున్నారని ప్రచారం చేయడం ఏమిటని మరి కొందరు సందేహాలను వ్యక్తం చేశారు.

అయితే వైరల్ అవుతున్న వార్తలకు సంబంధించి నరేష్ పీఆర్వో నుంచి క్లారిటీ వచ్చింది. పవిత్రా లోకేష్ తో పెళ్లైందని చెప్పిన మాటల్లో నిజం లేదని సీనియర్ నరేష్ వెల్లడించారని సమాచారం. ఈ విషయం గురించి ఇంతకు మించి స్పందించనని ఆయన చెప్పినట్టు నరేష్ పీఆర్వో తెలిపారు. మరోవైపు పవిత్రా లోకేశ్ మాత్రం ఈ వార్తల గురించి స్పందించడానికి అస్సలు ఇష్టపడకపోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో పవిత్ర లోకేశ్ నరేష్ నిజంగా పెళ్లి చేసుకుంటారో లేదో పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది.

పవిత్ర లోకేశ్ కు ఇప్పటికే వివాహం కాగా ఆమె భర్త నుంచి విడాకులు కోరారని సమాచారం. త్వరలో ఆమెకు విడాకులు మంజూరయ్యే ఛాన్స్ అయితే ఉంది. పవిత్ర లోకేశ్, నరేష్ పలు సినిమాలలో కలిసి నటించారు. ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించాయి. సీనియర్ నరేష్ పవిత్ర లోకేశ్ ప్రస్తుతం వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉండగా వీళ్లిద్దరి రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉందని సమాచారం అందుతోంది.

సీనియర్ నరేష్ తాజాగా సినీ కార్మికుల సమ్మె గురించి మీడియాతో స్పందించారు. కరోనా వల్ల సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న కష్టాలను వివరించి సినీ కార్మికుల సమ్మెను ఆపేందుకు తన వంతు కృషి చేశారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus