Facts Behind Sai Dharam Tej Accident: సాయి ధరమ్ తేజ్ కేసులో నిజాలు ఇవీ!

  • September 12, 2021 / 07:30 AM IST

  • నిన్న రాత్రి రేసింగ్ బైక్ స్కిడ్ అయ్యి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డ విషయం విదితమే. ఇందులో పోలీసుల ప్రాధమిక విచారణలో పలు నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి.

  • సిసి టివీ ఫుటేజ్ క్షుణ్ణంగా పరిశీలించిన పిమ్మట కేబుల్ బ్రిడ్జిపైన సాయి ధరమ్ తేజ్ వాహనం గంటకు 100 కిలోమీటర్ల వేగంకన్నా ఎక్కువగా పయనిస్తున్నట్టు, ఆక్సిడెంట్ సమయంలో గంటకు 75 కిలోమీటర్ల వేగానికి పైగా ఉన్నట్టు తేలింది

  • కేబుల్ బ్రిడ్జి పైన అనుమతించిన వేగం గంటకు 40 కిలోమీటర్లు కాగా, ఆక్సిడెంట్ జరిగిన ప్రదేశంలో గంటకు 30 కిలోమీటర్లు మాత్రమే ఉండాలి.

  • ట్రైంఫ్ కంపెనీ రేసింగ్ బైకును ఎల్బీనగర్‌కు చెందిన బూర అనిల్ కుమార్ దగ్గర కొన్నాళ్ల క్రితం కొనుగోలు చేసిన సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకూ అది తనపేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు.

  • ఇదే బైక్ మీద గత ఏడాది అధిక వేగంతో డ్రైవ్ చేసినందుకు రు. 1135 పెండింగ్ చలాన్ ఉన్నది. దీన్ని ఇవ్వాళే ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు చెల్లించారు. ఇది ఎవరు చెల్లించారో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • ప్రాధమిక విచారణలో ఇప్పటి వరకూ అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తరువాత ఈ ఆక్సిడెంట్ ప్రధానంగా అతి వేగంగా నడపడం, నిర్ల్యక్ష్యపూరిత డ్రైవింగ్ వల్లనే జరిగింది అని నిర్ధారణకు వచ్చిన పోలీస్ శాఖ.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus