మా పరిస్థితేంటి అన్న నాగ్‌!

బిగ్‌బాస్‌ హౌస్‌లో తొలి వీకెండ్‌ కదా… ఈ రోజు మంచిగా గానా బజానా కార్యక్రమం ఏర్పాటు చేసినట్లున్నారు. గత సీజన్ల కంటే ఈసారి డ్యాన్స్‌ బాగా చేసే పార్టిసిపెంట్లు వచ్చినట్లున్నారు. అందుకే బిగ్‌బాస్‌ ఈ రోజు డ్యాన్సింగ్‌ టాస్క్‌ పెట్టాడు. ఇంట్లో ఉన్న పార్టిసిపెంట్లలో ఇద్దరేసి ఒకే పాటకు డ్యాన్స్‌ వేసేలా టాస్క్‌ ఇచ్చాడు. అందులో ఎవరెవరు ఏ పాటకు డ్యాన్స్‌ వేశారో ఇంతకుముందు వార్తలో చదివే ఉంటారు. అయితే లాస్య, సూర్యకిరణ్‌ వంతు వచ్చేసరికి నాగ్‌ భయపడిపోయాడు.

‘రాములో రాములా.. ’ పాటకు లాస్య ఓవైపు, సూర్యకిరణ్‌ మరోవైపు డ్యాన్స్‌ వేశారు. పాట జోరందుకునేసరికి లాస్య తనదైన శైలిలో మంచి మూమెంట్స్‌ చేసింది. ఇక ఆమెను మ్యాచ్‌ చేయడానికి సూర్యకిరణ్‌ చొక్కా విప్పేసి డ్యాన్స్‌ వేశాడు. లోపల టీషర్ట్‌ ఉందనుకోండి. ఇక్కడే నాగ్‌ ఓ జోకేశాడు. ‘ఆపేయండి బాబోయ్‌…’ డ్యాన్స్‌ వార్‌ నిలిపేశాడు. ‘తర్వాత బనియన్‌ కూడా తీసేస్తే… మా పని ఔట్‌’ అంటూ పంచ్‌ కూడా వేశాడు. ఆయన పనేమో కానీ… అక్కడి హౌస్‌మేట్స్‌ పని, ఇంట్లో టీవీలు చూస్తున్నవాళ్ల పని కూడా ఔటే.. ఏమంటారు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus