మామూలు హీరోలే కొన్ని సినిమాల్లో నటించాక రిటైరయ్యాక హ్యాపీ లైఫ్ గడపడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆర్థికంగా ఎలాంటి జాగ్రత్తలు కావాలో తీసుకుంటున్నారు. అలాంటిది స్టార్ హీరోలు ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారో చెప్పండి. అవసరాలకు తగ్గ ధనాన్ని సమకూర్చుకుంటారు. లగ్జూరియస్ లైఫ్ అనుభవిస్తారు. కానీ ఓ స్టార్‌హీరో మాత్రం ఇందుకు వ్యతిరేకంగా మాట్లాడారు. తాను రిటైర్ అయ్యాక ఉబర్ డ్రైవర్‌ని అవుతా అని కామెంట్లు చేశారు. దీంతో ఆయన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
భాషతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్న హీరో ఫహాద్ ఫాజిల్. కేవలం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్, కీలక పాత్రధారిగా తనకంటూ ఓ పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన ప్రముఖ నటుడు వడివేలుతో కలసి ‘మారీశన్’ అనే సినిమా చేశారు. ఈ సినిమా ప్రచారంలో భాగంగానే భవిష్యత్తు గురించి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందులో ఈ క్యాబ్ డ్రైవర్ మాటలు కూడా ఉన్నాయి.
కొన్ని నెలల క్రితం ఫహాద్ ఫాజిల్ తనకెంతో ఇష్టమైన స్పెయిన్‌లోని బార్సిలోనా వెళ్లారట. ప్రేక్షకులు ‘ఇక చాల్లే చూడలేకపోతున్నాం..’ అని అనుకున్నప్పుడు బార్సిలోనా వెళ్లి స్థిరపడాలి అనుకుంటున్నాడట. జనాలను వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్లడం కంటే మంచి విషయం ఏముంటుంది. నా దృష్టిలో అది చాలా గొప్ప పని. డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ పని నాకు ఎప్పుడూ బోర్ కొట్టదు. అందుకే రిటైరయ్యాక బార్సిలోనా వెళ్లి ఉబర్ డ్రైవర్‌గా పని చేస్తాను అని చెప్పారు.
గతంలో ఓసారి ఫహాద్ ఇలానే ఏదో అడిగితే విషయం అడిగితే ఉబర్ డ్రైవర్‌గా ఉండడం కంటే నాకు ఆనందాన్నిచ్చే పని అని చెప్పారు. సినిమాల కంటే అదే ఆనందమిస్తుంది అని కూడా అన్నారు. అంతేకాదు ఈ విషయాన్ని తన భార్య నజ్రియాకు కూడా చెప్పినట్లు ఫహాద్ తెలిపారు. ఆమె దానికి ఓకే కూడా చెప్పింది అని తెలిపాడు.