Fahadh Faasil: ఆ వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టిన ఫహాద్ ఫాజిల్..!

అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కాబోతోంది. ‘బాహుబలి’ ‘కె.జి.ఎఫ్’ ల తరహాలో అన్న మాట. ఇక ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు మలయాళం స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్. ఇతను తెలుగు ప్రేక్షకులకు కొత్తేమో కానీ.. నేషనల్ అవార్డు కొట్టి ఇండియా మొత్తం పాపులర్ అయ్యాడు. ఇతను సక్సెస్ రేట్ ఎక్కువ ఉన్న హీరో. సినిమా.. సినిమాకి వేరియేషన్ చూపిస్తుంటాడు.

నటనలోనే కాదు, లుక్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు ఫాజిల్. ఇక ‘పుష్ప’ సినిమాలో ఇతను విలన్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తన పాత్ర చాలా ఫ్రెష్ గా ఉంటుందని ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా చెప్పుకొచ్చాడు ఫాజిల్. ఇతను హీరోగా నటించిన ‘అనుకోని అతిథి’ చిత్రాన్ని ఇటీవల తెలుగులోకి డబ్బింగ్ చేసి ఆహా ఓటిటిలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఫాజిల్ పాత్రకు హీరో తరుణ్ డబ్బింగ్ చెప్పాడు. అది చాలా బాగా కుదిరింది.

దీంతో ‘పుష్ప’ లో కూడా ఫాజిల్ పాత్రకు తరుణ్ తోనే డబ్బింగ్ చెప్పించాలని చిత్ర యూనిట్ సభ్యులు భావించారు. కానీ ఇందుకు ఫాజిల్ ఒప్పుకోలేదని ఇన్సైడ్ టాక్. ఎందుకంటే ఆల్రెడీ ఇతను తెలుగు భాష నేర్చుకుంటున్నాడట. ముఖ్యంగా చిత్తూరు యాసను కూడా ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలియజేసాడు. ‘పుష్ప’ లో తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకోవాలని భావిస్తున్నట్టు చెప్పి.. కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాడు,

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus