చిక్కుల్లో పడ్డ పవన్‌ కల్యాణ్‌ హీరోయిన్‌!

  • May 30, 2021 / 06:10 PM IST

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ప్రజలు పడుతున్న కష్టాలు అందరికీ తెలిసిందే. ఈ కరోనా కాలంలో ప్రాణం నిలవాలంటే వ్యాక్సిన్‌ తప్పనిసరి అని ప్రభుత్వాలు, వైద్యులు, శాస్త్రవేత్తలు చెబుతుండటంతో అందరూ ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. 18 ఏళ్లు నిండినవారు వ్యాక్సిన్‌ కోసం తమకు దొరికిన దారుల్లో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వ్యాక్సిన్‌ కోసం తప్పుడు ఐడీ కార్డు చేయించి… అడ్డంగా దొరికి పోయింది మీరా చోప్రా. ఇంతకీ ఏమైందంటే…

దేశంలో నాయకులకు, బడాబాబులకు దొరికినంత తేలికగా వ్యాక్సిన్ లు సామాన్య ప్రజలకు దొరకడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో నటి మీరా చోప్రా… ఫేక్ ఐడీతో వ్యాక్సిన్ వేయించుకోవడం విమర్శలకు దారితీస్తోంది. వ్యాక్సినేషన్‌కు సంబంధించి ఫొటోను మీరా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. దాంతోపాటు అందరూ వ్యాక్సినేషన్‌ చేయించుకోవాలని పోస్టు కూడా పెట్టింది. అయితే ఆమె ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కోటాలో వ్యాక్సిన్‌ వేయించుకున్నారని తెలిసింది.

సోషల్‌ మీడియాలో మీరా చోప్రా అప్పుడప్పుడు రాజకీయ విమర్శలు కూడా చేస్తుంటారు. దీంతో దొరికిన అవకాశాన్ని భాజపా కార్యకర్తలు వినియోగించుకుంటున్నారు. ఆమె మీద సోషల్‌ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ కోటాలో ఎలా వ్యాక్సిన్‌ వేయించుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఓం సాయి ఆరోగ్య కేర్ ప్రయివేట్ లిమిటెడ్ లో ఆమె సూపర్ వైజర్ గా పని చేస్తున్నట్లుగా ఓ ఫేక్ ఐడీ క్రియేట్ చేసిందట మీరా చోప్రా.

ఆ ఐడీ కార్డుతో థానేలోని పార్కింగ్ ప్లాజా వ్యాక్సినేషన్ సెంటర్ వద్ద వ్యాక్సిన్ వేయించుకున్నారట. నిబంధనలను అతిక్రమించి ఇలా వ్యాక్సిన్‌ వేయించుకున్నందుకు మీరా చోప్రాపై చర్యలు తీసుకోవాలని భాజపా కోరుతోంది. ఈ విషయమై స్పందించిన థానే మున్సిపల్ కార్పొరేషన్.. దీనిపై విచారణ చేస్తున్నామని, ఆరోపణలు రుజువైతే మీరా చోప్రాపై చర్యలు తీసుకుంటామని తెలిపింది. అయితే విషయం సీరియస్ అవుతోందని గమనించిన మీరా.. సోషల్‌ మీడియాలో వ్యాక్సిన్‌ పోస్టు తొలగించింది.

Most Recommended Video

ఏక్ మినీ కథ సినిమా రివ్యూ & రేటింగ్!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus