ప్రముఖ ఓటీటీలైన అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా, జీ5 లకు ఊహించని స్థాయిలో సబ్ స్క్రైబర్లు ఉన్నారు. ఈ ఓటీటీలలో తక్కువ సమయంలోనే పెద్ద హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అందరి సినిమాలు అందుబాటులోకి వస్తుండటంతో ఈ ఓటీటీలలో సినిమాలను చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఓటీటీల ధరలు ఎక్కువమొత్తంలో ఉండటంతో కొంతమంది మాత్రం ఓటీటీలలో సినిమాలను చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.
అయితే రాబోయే రోజుల్లో ఈ ఓటీటీ సంస్థలలో కొన్ని సంస్థలు ప్రేక్షకులకు బెనిఫిట్ కలిగే విధంగా నిర్ణయం తీసుకోనున్నాయని సమాచారం అందుతోంది. అయితే యాడ్స్ తో పాటు సినిమాలు ప్రసారమయ్యేలా, యాడ్స్ లేకుండా సినిమాలు ప్రసారమయ్యేలా ఓటీటీ సంస్థలు రెండు ఆప్షన్స్ ను అందుబాటులోకి తీసుకొనిరానున్నాయని సమాచారం అందుతోంది. ఈ ఆప్షన్లతో పాటు ఫ్రీగా కొన్ని సినిమాలను చూసే అవకాశాలను సైతం కొన్ని ఓటీటీ సంస్థలు కల్పించనున్నాయని బోగట్టా.
కేవలం సబ్ స్క్రిప్షన్ ఫీజులపై ఆధారపడటం వల్ల పెద్దగా లాభం ఉండదని ప్రముఖ ఓటీటీ సంస్థలు భావిస్తున్నాయి. అయితే ఏయే ఓటీటీ సంస్థలు ఈ దిశగా అడుగులు వేస్తాయో అడుగులు చూడాల్సి ఉంది. కొన్ని ఓటీటీ సంస్థలు ఇప్పటికే నెలకు, మూడు నెలలకు కూడా ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను తీసుకునే అవకాశాన్ని అయితే కల్పించాయనే సంగతి తెలిసిందే. గట్టి పోటీ ఉండటంతో ఓటీటీ సంస్థలు డిస్కౌంట్ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి.
ఓటీటీ సంస్థలు తీసుకుంటున్న నిర్ణయాలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త ఓటీటీ సంస్థలు సైతం ఎంట్రీ ఇస్తున్నా ఆ ఓటీటీలు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అవుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థలకు మాత్రం రోజురోజుకు క్రేజ్ పెరుగుతోంది. పల్లెల్లో కూడా ఓటీటీలపై అవగాహన పెరగడంతో సబ్ స్క్రైబర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Most Recommended Video
తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?