సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఎవరో ఒకరు మరణిస్తూనే ఉన్నారు. తెలుగులోనే కాకుండా పక్క రాష్ట్రాల్లోని సినీ నటులు,దర్శకులు లేదా నిర్మాతలు , లేదంటే టెక్నికల్ టీం సభ్యులు ఇలా ఎవరో ఒకరు మరణిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాం. లేదు అంటే వాళ్ల కుటుంబ సభ్యుల మరణ వార్తలు కూడా మనం వింటూనే ఉన్నాం. ఇటీవల మలయాళం స్టార్ హీరో మమ్ముట్టి తల్లి, సోదరి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక కోలీవుడ్ నిర్మాత కన్నుమూశారు.
వివరాల్లోకి వెళితే… ప్రముఖ కోలీవుడ్ నిర్మాత వి.ఎ.దురై కన్నుమూశారు. గత రెండు, మూడేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన ఆయన .. పరిస్థితి విషమించడంతో ఈరోజు తుది శ్వాస విడిచారు. వి.ఎ.దురై వయస్సు 59 యేళ్ళు. చెన్నైలోని ఆయన నివాసంలోనే ప్రాణాలు విడిచినట్టు సమాచారం. ఇక వి.ఎ.దురై గతంలో రజనీకాంత్ తో బాబా అనే సినిమాని నిర్మించారు. ఆ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఆయనకు (VA Durai) బాగా నష్టాలు వచ్చాయి.
అయితే రజనీకాంత్.. వి.ఎ.దురై కి అండగా నిలబడి నష్టపరిహారం చెల్లించారు. ఆ తర్వాత వి.ఎ.దురై… విక్రమ్ – సూర్య లతో శివపుత్రుడు ( తమిళంలో పితామగన్) అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా మంచి విజయం అందుకుంది. అలాగే విజయ్ కాంత్ , సత్యరాజ్ వంటి సీనియర్ హీరోలతో కూడా సినిమాలు చేశారు వి.ఎ.దురై. ఇక ఆయన మరణవార్తకి చింతిస్తూ కొంతమంది సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు