టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా ఏపీలోని వేర్వేరు ప్రాంతాలలో పర్యటిస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. పవన్ కళ్యాణ్ కు క్రేజ్, పాపులారిటీ పెరుగుతుండగా పవన్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన ఒక ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం.
తాజాగా పవన్ కళ్యాణ్ ఒక ఆశ్రమంలో మానసిక దివ్యాంగ పిల్లలను కలిశారు.
అయితే ఆ పిల్లలలో ఒక పిల్లవాడు పవన్ కళ్యాణ్ ను తాతయ్య అని పిలిచి షాకిచ్చాడు. ఆ పిల్లాడే పవన్ ను బాహుబలి అని డాడీ అని కూడా సరదాగా పిలవడం గమనార్హం. ఆ పిల్లాడి మాటలు విన్న పవన్ ఒక నవ్వు నవ్వి నీ అల్లరి ఎక్కువైందంటూ పవన్ కళ్యాణ్ ఆ పిల్లాడిని ముద్దు చేశారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండగా పవన్ ఏ సినిమాకు కాల్షీట్స్ కేటాయిస్తారనే చర్చ జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ పారితోషికం భారీ రేంజ్ లో ఉండగా పవన్ నటిస్తున్న సినిమాలలో ఏ సినిమా ముందు విడుదలవుతుందో ఏ సినిమా ఆలస్యంగా విడుదలవుతుందో స్పష్టత రావాల్సి ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానించే అభిమానుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. పవన్ కళ్యాణ్ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలతో బిజీగా ఉండగా హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఆలస్యమవుతోంది.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాలకు భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. పవన్ కొత్త సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. భాషతో సంబంధం లేకుండా పవన్ కు క్రేజ్ పెరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు.
మిస్టర్ ప్రెగ్నంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేమ్ కుమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
గత 10 సినిమాల నుండి రజనీకాంత్ సినిమాల థియేట్రికల్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?