తెలుగు సినీ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి అల్లు అర్జున్ కు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈయన తెలుగు చిత్ర పరిశ్రమలో నటిస్తున్న సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. ఇక పుష్ప సినిమా ద్వారా పాన్ ఇండియా స్టార్ హీరోగా ఇండస్ట్రీలో గుర్తింపు పొందినటువంటి ఈయనకు విపరీతమైనటువంటి అభిమానులు పెరిగిపోయారు. పాన్ ఇండియా స్థాయిలో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి అల్లు అర్జున్ కు అభిమానులు తరచూ తనపై ఉన్నటువంటి ప్రేమను విభిన్న రీతులలో తెలియజేస్తూ ఉంటారు.
ఇప్పటికే ఎంతోమంది వివిధ రకాలుగా (Allu Arjun) అల్లు అర్జున్ ఫోటోలను గీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఓ అభిమాని మాత్రం వినూత్న రీతిలో బన్నీపై ఉన్నటువంటి ప్రేమను బయట పెట్టారు. తాజాగా అల్లు అర్జున్ అభిమాని ఏకంగా నీటిపై అల్లు అర్జున్ పుష్ప సినిమాలోని గెటప్ వేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఇలా నీటిపై పుష్పరాజ్ గెటప్ లో అల్లు అర్జున్ ఆర్ట్ ఎంతో అద్భుతంగా వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది ఈ అభిమాని ప్రేమకు ఫిదా అవుతున్నారు.
ఇలా నీటిపై ఆర్ట్ వేయాలంటే సామాన్యమైన విషయం కాదు కానీ ఈ అభిమాని మాత్రం ఎంతో అద్భుతంగా పుష్పరాజ్ గెటప్ లో ఉన్న అల్లు అర్జున్ ఆర్ట్ వేయడంతో అందరూ ఆశ్చర్యపోతూ ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాపై కూడా ఇప్పటికే ఎన్నో అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఆగస్టు 15వ తేదీ విడుదల కానుంది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!