Adipurush: ‘ఆదిపురుష్‌’ డ్రాగన్‌ సీన్‌ రీక్రియేట్‌.. అదిరిపోయిందిగా!

దేశం గర్వించదగ్గ సినిమా.. కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు.. వెయిట్‌ చేస్తాం అంటూ ‘ఆదిపురుష్‌’ కోసం అభిమానులు చాలా రోజులు వెయిట్‌ చేశారు. సినిమా అప్‌డేట్లు ఇవ్వకపోయినా, అప్‌డేట్‌ ఇచ్చి అది అప్‌డేట్‌లా లేకపోయినా.. ఓర్చుకున్నారు. తీరా సమయం వచ్చేసరికి ఓ కార్టూన్‌ లాంటి టీజర్‌ వచ్చేసరికి ఉసూరుమన్నారు. ఇదేంటి ప్రభాస్‌ను ఇలా చూపిస్తారా అని డార్లింగ్‌ ఫ్యాన్స్‌ అంటే, రామాయణంలో ఈ విచిత్ర జంతువులు ఎక్కడి నుండి వచ్చాయి అంటూ సగటు సినిమా అభిమానులు అన్నారు.

నెటిజన్లు, ప్రేక్షకుల మాటల్ని టీమ్‌ మరచిపోతోంది అనుకునేలోపు ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యి.. ఇప్పుడు విమర్శల బాణాలకు కారణమవుతోంది. తాజాగా ఆదిపురుష్‌ గ్రాఫిక్స్‌కు సంబంధించి ఓ వీడియో నెట్‌లో హల్‌చల్‌ చేస్తోంది. టీజర్‌లో సైఫ్‌ అలీఖాన్‌ డ్రాగన్‌పై వచ్చే సన్నివేశాన్ని ప్రకాష్‌ అనే వ్యక్తి రీక్రియేట్ చేశాడు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది. ప్రకాష్‌ అనే ఓ నెటిజన్‌ ‘ఆదిపురుష్‌’ సినిమాలోని డ్రాగన్‌ సీన్‌ను తాను రీక్రియేట్‌ చేశాను అంటూ ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

ఆ వీడియోను చూసిన వాళ్లంతా సినిమా టీజర్‌లో చూపించిన వీడియో కంటే ఇదే బాగుంది కదా అంటూ కౌంటర్‌ వేస్తున్నారు. నీ నంబర్‌కు ‘ఆదిపురుష్‌’ డైరెక్టర్‌ ఓం రౌత్‌ నుండి త్వరలోనే ఫోన్‌ వస్తుంది కాచుకో అని కొందరు అంటుంటే… ‘సినిమా టీజర్‌లోని గ్రాఫిక్స్‌ కంటే ఈ వర్క్‌ వందశాతం బాగుంది’’ అని ఇంకొందరు అంటున్నారు. మరికొందరు అయితే ‘ఆదిపురుష్‌’ టీమ్‌ కొన్ని రూ. కోట్లు ఖర్చు పెట్టి, నెలలపాటు రూపొందించిన గ్రాఫిక్స్‌ను ఒక్క రాత్రిలో చేసేశావు కదా.. నువ్వు గ్రేట్‌’’ అని కామెంట్స్‌ చేస్తున్నారు.

‘ఆదిపురుష్‌’ టీమ్‌ అయోధ్యలో భారీ ఈవెంట్‌ను పెట్టి సినిమా టీజర్‌ను అక్టోబర్‌2న విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈవెంట్‌ ఫ్లాప్‌, ఆ తర్వాత టీజర్‌ కూడా ఫ్లాప్‌ అయ్యింది అనుకోండి. దానికితోడు టీజర్‌, టీజర్‌లో కంటెంట్‌ మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సినిమాను వచ్చే ఏడాది జూన్‌16కు వాయిదా వేశారు. నిజానికి సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తాం అని తొలుత ప్రకటించారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus