సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న ప్రభాస్, బన్నీ ఫ్యాన్స్

టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్ మరియు బన్నీ ఫ్యాన్ మధ్య వార్ షురూ అయ్యింది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు విమర్శల దాడి చేసుకుంటున్నారు. మా హీరో గొప్పంటే మా హీరో గొప్పని కొట్టుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటని పరిశీలిస్తే…బన్నీ గత చిత్రం అల వైకుంఠపురంలో భారీ విజయం అందుకోవడంతో పాటు బన్నీకి మంచి ఫేమ్ తెచ్చి పెట్టింది. ఆ మూవీలోని సాంగ్స్ బాలీవుడ్ దాకా పాకాయి. ముఖ్యంగా బుట్ట బొమ్మా సాంగ్స్ ని బాలీవుడ్ సెలెబ్రిటీలు శిల్పా శెట్టి, హృతిక్ రోషన్, దిశా పటాని వంటి స్టార్స్ పొగిడేశారు.

ఆ పాటలో బన్నీ డాన్స్ అద్భుతం అన్నారు. తాజాగా బాలీవుడ్ దర్శకుడు సంజయ్ గుప్తా…అల వైకుంఠపురంలో మూవీ అద్భుతంగా ఉందని, బన్నీ అవకాశం ఇస్తే మూవీ చేస్తాను అన్నారు. దీనిపై ఓ అంగ్ల పత్రిక ఓ కథనం రాయడం జరిగింది. ఇక తెలుగు మీడియాకు దీనిని కవర్ చేయడంతో బన్నీ ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నారు. ఇప్పటికే మూడు వరుస హిట్స్ తో బాలీవుడ్ లో కింగ్ గా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది నచ్చలేదు.

బన్నీపై బాలీవుడ్ పొగడ్తల వెనుక మాఫియా ఉందని, పి ఆర్ ఓ ల సాయంతో కావాలనే కొందరి చేత అలా చేయిస్తున్నారు అంటున్నారు. దీనితో ఈ ఇద్దరు ఫాన్స్ మధ్య పెద్ద చర్చకు తెరలేచింది. ఇప్పుడే మొదలైన ఈ ఫ్యాన్ వార్ ఎక్కడి వరకు వెళుతుందో చూడాలి. నిజానికి టాలీవుడ్ లో ప్రభాస్ మరియు అల్లు అర్జున్ మంచి మితృలు. మెగా ఫ్యామిలీకి కూడా ప్రభాస్ చాలా సన్నిహితుడు.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus