సినిమా హీరో అంటే కుటుంభ సభ్యుల లెక్క…ఇంకా చెప్పాలి అంటే మన తెలుగు సినిమాల విషయానికి వస్తే మన వాళ్ళు కుటుంభం కన్నా…ఎక్కువగా తమ అభిమాన నటులను అభిమనిస్తూ, ఫాలో అవుతూ, ఇంకా చెప్పాలి అంటే అనుకరిస్తూ, వారిని అనుసరిస్తూ ముందుకు సాగుతారు అభిమానులు…అయితే సినిమా హిట్స్ ని బట్టి. సినిమాల్లో ఆయా తారలు చేసిన పాత్రలను బట్టి కొందరి హీరోలకు అభిమానులు అభిమానంతో బిరుదులు ఇస్తారు. అలా అభిమానంతో పొంగి పోయి, తమ అభిమాన నటులకు బిరుదులు అందించిన వారిలో ఎందరో హీరోల అభిమానులు ఉన్నారు. మరి ఆ బిరుదులు అందుకున్న హీరోల్లో ఎవరెవరు ఏ బిరుదులు అభిమానుల వద్ద నుంచి అందుకున్నారో ఒకసారి ఒక లుక్ వేద్దాం రండి….
ఎస్వీ రంగారావు – నట సార్వభౌమ…టాలీవుడ్ లో ఎన్టీఆర్ రేంజ్ యాక్టింగ్ చెయ్యగల ఏకైక నటుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆది ఒక్క ఎస్వీ రంగారావే అని చెప్పక తప్పదు. అప్పట్లో ఎన్టీఆర్, ఎస్వీఆర్ కలసి చేసిన పోటాపోటీ పాత్రలు అభిమానులకు ఆనందాన్ని పంచాయి.
ఎన్టీరామారావు – నట రత్న , విశ్వ విఖ్యాత నట సార్వభౌమఈ నట ప్రస్థానం గురించి ఏం చెప్పినా..ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నటనకు ఓనమాలు నేర్పిన నటరత్న, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ అంటే అతిశయోక్తి కాదు…ఆయనో నటనా గ్రంధం.
అక్కినేని నాగేశ్వర రావు – నటసామ్రాట్ట్ర్యాజిడీ పాత్రలకు ప్రాణం పోసిన నటుడు మన అక్కినేని…అప్పట్లో ట్ర్యాజిడీ కధల్లో ఆయన నటన అద్భుతం.
ఘట్టమనేని కృష్ణ – నటశేఖర్అప్పట్లో కుటుంభ కధా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ మన నట శేఖర్ కృష్ణ.
శోభన్ బాబు – నట భూషణ్ఎన్టీఆర్, తరంలో అందగాడిగా మంచి పాత్రలతో అందరినీ మెప్పించిన హీరో మన నట భూషణ్ శోభన్ బాబు
కొంగర జగ్గయ్య – కళా వాచస్పతిసహాయ పాత్రల్లో, విలన్ పాత్రలో, ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటన అనే పదానికి ప్రాణం పోసినా నటుడు కళా వాచస్పతి కొంగర జగ్గయ్య.
రావు గోపాలరావు – నట విరాట్విలన్ గా ఒక సరికొత్త పద్దతిని టాలీవుడ్ కి అలవాటు చేసింది నట విరాట్ రావు గోపాలరావు గారే.
కైకాల సత్యనారాయణ – నవరస నటనా సార్వభౌమకామెడీ నుంచి సెంటిమెంట్ వరకూ, విలన్ నుంచి సహాయ పాత్ర వరకూ అద్భుతమైన నటనకు ప్రాణం పోసినా వ్యక్తి నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారు.
రాజేంద్రప్రసాద్ – నటకిరీటికామెడీ కి సరికొత్త టైమింగ్ నేర్పిన వ్యక్తి రాజేంద్రప్రసాద్.
మోహన్ బాబు – నట ప్రపూర్ణవిలన్ నుంచి హీరో వరకూ కామెడీ నుంచి సహాయ పాత్రల వరకూ నటించి మెప్పించి ఎన్టీఆర్ తరువాత అంతటి బలమైన డైలాగ్ డెలివరీ కేవలం మోహన్ బాబుకే సొంతం అని చెప్పక తప్పదు.
నందమూరి బాలకృష్ణ – యువ రత్న, నటసింహంఎన్టీఆర్ వారసుడిగా, తెలుగు తెరపై నట విశ్వరూపం చూపించిన బాలయ్యని అభిమానులు అభిమానంతో యువరత్న, నటసింహం అని పిలుచుకుంటారు.
నాగార్జున – యువ సామ్రాట్అక్కినేని నాగేశ్వర రావు కుమారుడుగా, నాగార్జున ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ అందరినీ మెప్పిస్తూ ఉన్నాడు.