Prabhas: స్టార్ హీరో ప్రభాస్ కు అచ్చొచ్చిన కలర్ ఇదే.. అసలేం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్  (Prabhas)  వరుస సినిమాలలో నటిస్తుండగా ప్రభాస్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లోనే థియేటర్లలో రిలీజ్ కావడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలను అందిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న ది రాజాసాబ్ (The Rajasaab) మూవీ నుంచి తాజాగా గ్లింప్స్ రిలీజ్ కాగా ఈ గ్లింప్స్ కు 5 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. గ్లింప్స్ లో ప్రభాస్ లుక్స్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వింటేజ్ ప్రభాస్ ను చూస్తున్నామంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హర్రర్ రొమాంటిక్ కామెడీ జానర్ లో ఈ సినిమా తెరకెక్కుతుండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మరో 1000 కోట్ల మూవీ లోడింగ్ అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ల ద్వారా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ది రాజాసాబ్ మూవీ మారుతి కెరీర్ కు ఊహించని స్థాయిలో ప్లస్ కానుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మరోవైపు ప్రభాస్ మెరూన్ కలర్ లక్కీ కలర్ అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. బాహుబలి2 సినిమాలో అమరేంద్ర బాహుబలి (Baahubali)  పాత్రలో కొన్ని నిమిషాల పాటు ప్రభాస్ మెరూన్ కలర్ డ్రెస్ లో కనిపించారు. కల్కి సినిమాలో సైతం ఇంటర్వెల్ సమయంలో ప్రభాస్ చక్రాన్ని ఆపే సీన్ లో సైతం మెరూన్ కలర్ డ్రెస్ లో కనిపించారు. ఈ రెండు సినిమాలు ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

రాజాసాబ్ గ్లింప్స్ లో సైతం ప్రభాస్ మెరూన్ కలర్ డ్రెస్ లో కనిపించి మెప్పించడం గమనార్హం. రాజాసాబ్ సినిమాతో సైతం ప్రభాస్ మ్యాజిక్ చేస్తారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దాదాపుగా 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ది రాజాసాబ్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus