సూపర్ స్టార్ మహేష్ బాబుకి దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ట్విట్టర్లో ఏడు మిలియన్(70 లక్షల) మంది మహేష్‌ను ఫాలో అవుతున్నారు. అందుకే తన సినిమా విషయాలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటారు. తోటి హీరోల సినిమాలను చూసి తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెబుతుంటారు. అంత స్టార్ అయినప్పటికీ తప్పుగా ట్వీట్ చేస్తే విమర్శలు తప్పవు. గతంలో అటువంటి అనుభవం మహేష్ కి ఉంది. తాజాగా తాను చేసిన ట్వీట్ వల్ల ఇబ్బందుల్లో పడ్డారు. ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఈరోజు దసరా సందర్భంగా తెలుగు, తమిళం, మలయాళం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో శుభాకాంక్షలు తెలిపారు.
అందరూ ఆనందపడ్డారు. అయితే కన్నడ అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని భాషలకు సమానమైన ప్రాముఖ్యత ఇవ్వండని, ఎక్కువగా అభిమానులున్న కన్నడకు కూడా కాస్త గౌరవం ఇవ్వడంటూ మహేష్‌కు సూచించారు. దీంతో పొరపాటును గుర్తించిన మహేశ్ బాబు కన్నడ భాషలోను శుభాకాంక్షలు చెప్పారు. భరత్ అనే నేను సినిమా తర్వాత మహేష్ బాబు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’ సినిమా చేస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ స్టడీగా షూటింగ్ జరుపుకుంటోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.