ఆ హీరోయిన్ కి మరీ అంత బలుపా అంటున్న ఫాన్స్..!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అయినా హీరోలలో ఒకడు మాస్ మహారాజ రవితేజ. కెరీర్ ప్రారంభం లో ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా చాలా కాలం పని చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎలాంటి రికమండేషన్స్ లేకుండా తన సొంత టాలెంట్ తోనే ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. కృష్ణ వంశీ , రామ్ గోపాల్ వర్మ , కె రాఘవేంద్ర రావు ఇలా ఎంతో మంది డైరెక్టర్స్ తో ఆయన పని చేసాడు.

అలా పని చేస్తున్న రోజుల్లో రవితేజ కి ఎన్నో అవమానాలు ఎదురు అయ్యాయి. కానీ వాటి అన్నిటిని మనస్ఫూర్తిగా భరించాడు, రాబొయ్యేది మన రోజులే అని మనసులో అనుకోని ఎన్ని అవమానాలు ఎదురైనా తట్టుకొని వచ్చిన ప్రతీ అవకాశం ని ఉపయోగించుకున్నాడు కాబట్టే నేడు ఈ స్థాయిలో ఉన్నాడు. అయితే గతం లో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తనకి ఎదురైనా ఒక చేదు జ్ఞాపకం ని గుర్తు చేసుకొని బాధపడ్డాడు రవితేజ.

ఒక ప్రముఖ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న రోజుల్లో ఒక టాప్ హీరోయిన్ కి ఒక షాట్ కోసం వేసుకోవాల్సిన చెప్పులు లేకపోవడం తో ఆ డైరెక్టర్ చాలా చిరాకు పడ్డాడు అట. ఇవన్నీ చూసుకోవాల్సింది అసిస్టెంట్ డైరెక్టర్ కదా, ఆ రవితేజ ఏమి చేస్తున్నాడు, పిలవండి వాడిని ఇటు అని సెట్స్ లో అందరి ముందు ఆ డైరెక్టర్ అరిచాడట.

అప్పుడు రవితేజ నేను మీరిచ్చిన చెప్పులే ఇచ్చాను సార్ ఆమెకి, అవి వేసుకొనే షాట్ కి వస్తుంది అనుకున్నాను, ఇలా చేస్తుంది అనుకోలేదు అని అన్నాడట. అప్పుడు ఆ డైరెక్టర్ ఆ హీరోయిన్ ని తిట్టే ధైర్యం లేక రవితేజ పై ఇష్టమొచ్చినట్టు అరిచాడట. అప్పుడు స్వయంగా రవితేజ నే ఆమె పాదాలను తాకి ఆ చెప్పులను పట్టుకొని వెళ్లి పక్కన పడేసి, డైరెక్టర్ ఇచ్చిన చొప్పులను తొడిగాడట. షాట్ అయిపోయాక తన వల్ల అన్ని తిట్లు తిన్నందుకు రవితేజ కి ఆ టాప్ హీరోయిన్ క్షమాపణలు చెప్పిందట.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus