రామ్ చరణ్‌కు కేవలం తెలుగులో మాత్రమే కాదు.. మిగిలిన ఇండస్ట్రీలలో కూడా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా హిందీలో అయితే మెగా వారసుడికి ఉన్న ఫాలోయింగ్ చూసి అంతా షాక్ అయిపోయారు. తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమా ఈవెంట్ కోసం ముంబై వెళ్లిన రామ్ చరణ్‌కు అక్కడ అబిమానులు బ్రహ్మరథం పట్టారు. ఆయన్ని చూడ్డానికి అభిమానులు వీరంగం సృష్టించారు. గేట్లు బద్దలుకొట్టి మరీ లోపలికి రావడానికి ప్రయత్నించారు. వాళ్లను అదుపు చేయడానికి అక్కడున్న సెక్యూరిటీ వల్ల కూడా కాలేదు. రామ్ చరణ్‌ను చూడాలనే ఎగ్జైట్‌మెంట్‌లో అక్కడున్న బారికేడ్స్ కూడా తెంచేసుకుని లోపలికి వచ్చారు అభిమానులు.
దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ సౌత్ ఇండియన్ హీరోకు ముంబైలో కూడా ఈ స్థాయిలో ఫాలోయింగ్ ఉంటుందా అంటూ అక్కడున్న వాళ్లు కూడా ఆశ్చర్యపోతున్నారు. రామ్ చరణ్‌కు ముందు నుంచి కూడా అన్ని ఇండస్ట్రీలలో మంచి గుర్తింపు ఉంది. అతడు నటించిన మగధీర సినిమాతో అన్ని భాషల్లోనూ ఫేమస్ అయ్యాడు. మరోవైపు జంజీర్ సినిమాతో 8 ఏళ్ల కిందే బాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించాడు రామ్ చరణ్. సినిమా ఫలితంతో సంబంధం లేకుండా హిందీలో చరణ్‌కు మంచి గుర్తింపు వచ్చింది.
దాంతో పాటు చరణ్ నటించిన సినిమాలు హిందీలో డబ్బింగ్ అయి విడుదల అవుతుంటాయి. యూ ట్యూబ్‌లోనూ మెగా పవర్ స్టార్ సినిమాలకు అద్భుతమైన ఫాలోయింగ్ ఉంటుంది. వందల మిలియన్స్ వ్యూస్ వస్తుంటాయి. పాన్ ఇండియన్ స్టేటస్ అందుకున్న రామ్ చరణ్.. తన కొత్త సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. అభిమానులు ట్రిపుల్ ఆర్ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్, చరణ్ నటించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కానుంది.
రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్ర బడ్జెట్ అక్షరాలా 350 కోట్లకు పైగానే ఉంది. రామ్ చరణ్ తర్వాత సినిమా ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల కానుంది. చిరంజీవి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో చరణ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొరటాల శివ దర్శకుడు. అలాగే శంకర్, గౌతమ్ తినన్నూరి దర్శకత్వంలో వరస సినిమాలకు కమిటయ్యాడు రామ్ చరణ్. శంకర్ సినిమాను దిల్ రాజు.. గౌతమ్ తిన్ననూరి సినిమాను యువీ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.
Most Recommended Video
‘పుష్ప’ చిత్రంలో ఆకర్షించే అంశాలు..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!