Vijay Thalapathy: విజయ్ చివరి సినిమాపై అభిమానుల ఆశలు.. ఈ మూవీ హిట్టవుతుందా?
- September 16, 2024 / 11:27 AM ISTByFilmy Focus
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ కు (Vijay Thalpathy) ప్రేక్షకుల్లో బాగానే క్రేజ్ ఉండగా విజయ్ చివరి సినిమా కేవీఎం ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ లో ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కనుంది. ఈ సినిమాకు విజయ్ రెమ్యునరేషన్ ఏకంగా 275 కోట్ల రూపాయలు అని ప్రచారం జరుగుతుండగా ఈ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. రెమ్యునరేషన్ పరంగా షారూఖ్ ఖాన్ (Shah Rukh Khan) టాప్ లో ఉండగా ఆ తర్వాత స్థానంలో విజయ్ ఉన్నారు. విజయ్ రెమ్యునరేషన్ ఇండస్ట్రీ వర్గాలను సైతం షాక్ కు గురి చేస్తుండటం గమనార్హం.
Vijay Thalapathy

అయితే విజయ్ గత సినిమా ది గోట్ (The Greatest of All Time) ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచిన సంగతి తెలిసిందే. తమిళనాడు మినహా మరే రాష్ట్రంలో ఈ సినిమాకు భారీ స్థాయిలో కలెక్షన్లు అయితే రాలేదు. విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న నేపథ్యంలో చివరి సినిమాతో అయినా విజయ్ బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారా అనే చర్చ జరుగుతోంది. విజయ్ చివరి సినిమాపై అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.

హెచ్.వినోద్ (H Vinoth) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా థియేటర్లలో విడుదలయ్యే ఛాన్స్ ఉంది. 2026 సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనుండటంతో విజయ్ చివరి సినిమాను వీలైనంత వేగంగా పూర్తి చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విజయ్ (Vijay Thalapathy) క్రేజ్ మాత్రం రోజురోజుకు ఊహించని స్థాయిలో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.

విజయ్ చివరి సినిమా ఎలాంటి కథతో తెరకెక్కుతుందో చూడాలి. లియో (LEO) సీక్వెల్ లో విజయ్ నటిస్తారని ఆశ పడిన ప్రేక్షకులకు ఒకింత నిరాశే ఎదురైంది. విజయ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అయితే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. విజయ్ కెరీర్ ప్లానింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పొలిటికల్ గా విజయ్ సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.














