టాప్ స్టార్స్ లో ఒకరిగా ఏళ్లుగా కొనసాగుతున్న బాలయ్య అనేక ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చారు. ఐతే బాలయ్య ఎప్పుడూ మూసకథలు ఎంచుకుంటారు. ఆయన సినిమాలన్నీ ఒకేలా ఉంటాయనే అపవాదు ఉంది, కెరీర్ బిగినింగ్ లో బాలయ్య ఆదిత్య 369, భైరవ ద్వీపం, నారీనారీ నడుమమురారి వంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించారు. ఒక దశ దాటిన తరువాత బాలయ్య ఒక ఫార్మాట్ ప్రకారం సినిమాలు చేస్తున్నారు. బీభత్సమైన డైలాగ్స్, రక్తం ఏరులై పారేలా పోరాటాలు, ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్స్, ఆరు పాటలు అనేవి బాలయ్య సినిమలో కామన్ గా కనిపించే అంశాలుగా మారిపోతున్నాయి.
సమరసింహారెడ్డి మూవీ తరువాత బాలయ్య ఒకే హీరోయిన్ తో చేసిన చిత్రాలు లక్ష్మీ నరసింహ, గౌతమీ పుత్ర శాతకర్ణి వంటివి ఒకటి రెండు ఉన్నాయి. బాలయ్య కి రెండు గెటప్స్, గెటప్ కి ఓ హీరోయిన్ చొప్పున ఇద్దరు హీరోయిన్స్. ఇలా బాలయ్య ఎప్పటి నుండో ఇదే పద్దతి ఫాలో అవుతున్నారు. బాలయ్య డై హార్డ్ ఫాన్స్ కూడా బాలయ్య ఎప్పుడూ ఇలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకోవడం నచ్చడం లేదు. సోషల్ మీడియా మరియు ఇతర మాధ్యమాల ద్వారా తమ అసహనం బాలయ్యకు తెలియజేస్తున్నారు. బాలయ్య నువ్వు మారాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఎప్పుడో ఐదారేళ్లకు వస్తున్న ఓ విజయం తరువాత వరుసగా పరాజయాలు వస్తున్నా, అదే తరహాలో సినిమాలు చేస్తున్నారు. బాలయ్య సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుండగా, ఆయన మార్కెట్ పూర్తిగా పడిపోయింది. గత ఏడాది విడుదలైన రూలర్, యంగ్ హీరో ధరమ్ తేజ్ ప్రతిరోజూ పండగే మూవీ వసూళ్ళలో సగం కూడా రాబట్ట లేకపోవడం దారుణం. కాబట్టి ఇకనైనా బాలయ్య మేలుకుంటే మంచిది.
Most Recommended Video
‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?