టాలీవుడ్ రీమేక్స్ గురించి నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఏదంటే..?

  • December 11, 2022 / 01:44 PM IST

ఈమధ్య ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేస్తున్నామని మేకర్స్ అనౌన్స్ చేసినప్పుడు.. స్టార్ హీరో ఫ్యాన్స్, సామాజిక మాధ్యమాల ద్వారా నిరసన వ్యక్తం చేస్తుండడం లాంటి సంఘటనలు చూస్తున్నాం.. ఆల్ రెడీ చూసేసిన సినిమాని రీమేక్ చేయడం ఎందుకు అనేది వాళ్ల వెర్షన్.. అయితే ఒక భాషలో తెరకెక్కి.. మిగతా భాషల్లో డబ్ అయ్యి విడుదలవడం.. లేదా రీమేక్ చేస్తే సూపర్ హిట్ అవడం.. కొన్నిసార్లు రిజల్ట్ రివర్స్‌లో రావడం జరుగుతుంటుంది..

మేకర్స్ విషయానికొస్తే.. రీమేక్ అనేది వాళ్లకి కత్తి మీద సాము లాంటిది.. మన నేటివిటీ, భాష, ప్రాంతం, సంసృతికి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేయాలి.. అదేమంత తేలికైన విషయం కాదు.. ఎలాంటి మార్పులు చేసినా కానీ కథలో ఉండో సోల్ (ఆత్మ) అనేది మిస్ కాకూడదు.. ఏ చిన్న సన్నివేశంలోనూ తేడా కొట్టకూడదు.. ఆ విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా కానీ మొదటికే మోసం వస్తుంది..ఈ విషయం ఇప్పుడు ఎందుకంటే..

రీమేక్ అనేది ఓ టాప్ స్టార్‌తో చేసేటప్పుడు అతని ఇమేజ్, ఫ్యాన్స్, ఆడియన్స్ లాంటి వాటి గురించి చాలానే లెక్కలేసుకుంటారు మేకర్స్.. డబ్ అవడానికీ.. మన నేటివిటీకి తగ్గట్టు మార్చి.. సరికొత్తగా చేయడానికీ తేడా ఉంటుంది.. ఇక ఈ రీమేక్ వార్తల నేపథ్యంలో.. ’రీమేక్ వార్తలు వచ్చినప్పుడల్లా ఫ్యాన్స్ పరిస్థితి ఇదీ’ అంటూ నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. సందర్భం ఏదైనా దానికి తగిన సినిమా పోస్టర్, సీన్లతో మీమ్స్, పేరడీలు చేయడం అనేది ఇప్పటి ట్రెండ్ కాబట్టి..

ఇప్పటి పరిస్థితికి తగినట్టుగా.. పెద్ద వంశీ డైరెక్ట్ చేసిన క్లాసికల్ కామెడీ ఫిలిం ‘ఏప్రిల్ 1 విడుదల’ సినిమాలోని ఓ సన్నివేశానికి దీనితో లింక్ పెట్టారు.. సాక్షి రంగారావు టీవీ తెచ్చి, సినిమా వేస్తానని జనాలందర్నీ పోగు చేస్తాడు.. తీరా ఆన్ చేశాక ఆ టీవీ కాస్తా పేలిపోతుంది.. దెబ్బకి ఎక్కడి వాళ్లక్కడ తలో దిక్కూ పారిపోతుంటారు.. ఆ అదిరపోయే సీన్‌నే ఇప్పటి టాలీవుడ్ రీమేకులకి ముడిపెట్టారు.. దీంతో వీడియో నెట్టింట బాగా చక్కర్లు కొడుతోంది..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus