Allu Arjun: లైనప్‌ గురించి అంత సీక్రెట్‌ ఎందుకు అర్జునా?

సినిమా మీద సినిమా, సినిమా తర్వాత సినిమా అంటూ వరుసగా లైనప్‌లు ఫిక్స్‌ చేసేసుకుంటున్నారు స్టార్‌ హీరోలు. ఈ లిస్ట్‌లో అల్లు అర్జున్‌ పేరు లేదు అంటే మీరు నమ్ముతారా? కావాలంటే మీరే లెక్కేసుకోండి. ‘పుష్ప 2’ కాకుండా బన్నీ నుండి వచ్చే సినిమా గురించి అఫీషియల్‌ లేదా అన్‌ అఫీషియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఏదీ లేదు. దీంతో సోషల్‌ మీడియాలో అల్లు అర్జున్‌ ఫ్యాన్స్‌.. చర్చించుకుంటున్నారు. ‘బన్నీ ఏదో ఒకటి చెప్పేయొచ్చుగా’ అంటూ అడుగుతున్నారు.

బ్లాక్‌ బస్టర్‌ సినిమా ఇచ్చాక… చేయబోయే సినిమాల విషయంలో హీరోలు చాలా జాగ్రత్తగా ఒకటికి, రెండుసార్లు ఆలోచించుకుని ముందుకెళ్తుంటారు. అలా ఇప్పుడు బన్నీ కూడా ‘పుష్ప’ విజయాన్ని బ్యాలెన్స్‌ చేసే కథల వేటలో ఉన్నాడట. ‘పుష్ప 2’ కూడా భారీ విజయం సాధిస్తుంది కాబట్టి.. దానికి కూడా సరిపోయే నెక్స్ట్‌ మూవీ ఉండాలనేది ఆయన కోరికట. దీని కోసం బాలీవుడ్‌ దర్శకుడినైనా రంగంలోకి దింపే ఆలోచన చేస్తున్నారట. దీంతోనే లైనప్‌పై క్లారిటీ రావడం లేదంటున్నారు.

‘పుష్ప 2’ సినిమాను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉంది సుకుమార్‌. అయితే సినిమా కథకు, కథనానికి మార్పులు ఇంకా అవసరమని భావించి.. వాటి మీద టీమ్‌తో కుస్తీ పడుతున్నారట. అందుకే జులైలో సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ చేయాలని చూస్తున్నారట. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుందని సమాచారం. ఆ తర్వాత బన్నీ సినిమా ఏంటి అనేదే ఇక్కడ ప్రశ్న. ‘పుష్ప’తో పాన్‌ ఇండియా హీరో అయ్యాడు బన్నీ. కాబట్టి ఆ తర్వాతి సినిమా కూడా ఆ స్థాయిదే అయి ఉండాలి.

గతంలో బన్నీతో సినిమా అనుకున్న దర్శకుల సంగతి ఓసారి చూస్తే… వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్‌’ అనుకున్నారు. ఆ ముచ్చటేమీ ఇప్పుడు వినిపించడం లేదు. కొరటాల శివతో సినిమా అన్నారు, అనౌన్స్‌ చేశారు, క్యాన్సిల్‌ చేశారు. త్రివిక్రమ్‌తో సినిమా అన్నారు.. అయితే ఆయన మహేష్‌ సినిమా పనిలో ఉన్నారు. ఆ తర్వాత సీనియర్‌ స్టార్‌తో సినిమా అని సమాచారం. ఇక బోయపాటి శ్రీనుతో కూడా అనుకున్నారు. కానీ ఆయన రామ్‌ సినిమా ఓకే చేశారు. ఆ తర్వాత బాలయ్యతో ఓ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్ సినిమా అంటున్నారు.

ఇక ప్రశాంత్‌ నీల్‌తో సినిమా అని పుకార్లొచ్చినా.. ఆ తర్వాత బన్నీ టీమ్‌ నుండి కానీ, ప్రశాంత్‌ టీమ్‌ నుండి కానీ అలాంటి మాటలేం వినిపించలేదు. దీంతో ఎవరు నెక్స్ట్‌ దర్శకుడా అనేది తెలియడం లేదు. అయితే బన్నీ ఆ మధ్య సంజయ్‌ లీలా భన్సాలీని కలిశాడు. ‘పుష్ప 2’ తర్వాతి సినిమా కోసమే బన్నీ ఆయన్ను కలిశాడా అనేది ఇప్పుడు క్లారిటీ వస్తున్న డౌట్‌.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus