Faria Abdullah: అవన్నీ అపోహలే అంటున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా!

ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) .. జాతి రత్నాలు చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ.. అటు తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, బంగార్రాజు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ వంటి చిత్రాల్లో నటించింది. ఈమె చేతిలో ఇప్పుడు బోలెడన్ని ఆఫర్ లు ఉన్నాయి. రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలో కూడా ఈమె ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అయితే అది హీరోయిన్ రోల్ కాదు.

కీలక పాత్ర అంతే..! ఈమెకు మెయిన్ లీడ్ గా అవకాశాలు దక్కకపోవడానికి ఈమె హైట్ కారణమని చాలా మంది అంటున్నారు. అయితే అది వట్టి అపోహ మాత్రమే అంటుంది ఈ బ్యూటీ. రావణాసుర ప్రమోషన్స్ లో పాల్గొన్న ఈమె కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మీడియాతో పంచుకుంది. ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) మాట్లాడుతూ..” రవితేజగారితో కలిసి నటించే అవకాశం ఇంత త్వరగా రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రవితేజ గారు సెట్లో అడుగుపెడుతున్నారు అనగానే అందరిలోనూ ఒక్కసారిగా ఎనర్జీ పెరిగిపోతుంది.

అప్పటి నుంచి అందరూ హుషారుగా పనిచేయడం మొదలుపెడతారు. సీనియర్ హీరో అయినప్పటికీ సీన్ బాగా రావడం కోసం ఆయన పడే తపన చూసి ఎవ్వరైనా షాక్ అవుతారు.ఈ సినిమాలో ఏ హీరోయిన్ ఇంపార్టెన్స్ ఎంత అంటే చెప్పలేము. కథను బట్టి ఆ పాత్రలు ఎంట్రీ ఇస్తుంటాయి. రవితేజగారికి .. నాకూ మధ్య కామెడీ టచ్ ఉంటుంది. మా కాంబినేషన్ సరదాగానే సాగుతుంది . ఇక నా హైట్ నాకు మైనస్ అవుతుంది అని అంతా అంటున్నారు. అది వట్టి అపోహ. నేను అలా అనుకోవడం లేదు” అంటూ చెప్పుకొచ్చింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus