Faria Abdullah: బాయ్ ఫ్రెండ్స్ పై ఫరియా షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన ఫరియా అబ్దుల్లా జాతిరత్నాలు సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకోగా లైక్ షేర్ & సబ్స్క్రైబ్ సినిమా ఫలితం ఆమెకు భారీ షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లు రాకపోవడంతో అభిమానులు ఫీలయ్యారు. అయితే ఫరియా అబ్దుల్లా తాజాగా షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నేను కోరుకున్న దాని కంటే జాతిరత్నాలు సినిమాతో ఎక్కువ పేరు వచ్చిందని ఆమె కామెంట్లు చేశారు.

ఈ సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడటానికి వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు. జాతిరత్నాలు మూవీ ప్రారంభానికి ముందే సెల్ఫీ తీసుకున్నానని ఆ సెల్ఫీ తీసుకున్న సమయంలో ఈరోజుతో నా లైఫ్ ఎలాగైనా మారిపోవచ్చని ఈ సినిమా నాకు ప్లస్ కావచ్చు మైనస్ కావచ్చు అని అనుకున్నానని ఆమె కామెంట్లు చేశారు. ఏదేమైనా నేను నేనులానే ఉండాలని మారిపోకూడదని ఆ సమయంలో అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు. నేను ఏ పని మొదలుపెట్టినా మధ్యలోనే ఆపేస్తుంటానని ఆమె అన్నారు.

నేను క్లాసికల్ డ్యాన్సర్ నని కొన్ని షోలు చేశానని వర్క్ షాప్ లు నిర్వహించానని ఆమె కామెంట్లు చేశారు. నా మైండ్ సెట్ చాలా విచిత్రమైనదని ఎవరికీ అర్థం కానని ఆమె చెప్పుకొచ్చారు. నా కంటే వయస్సులో పెద్దవారితో సన్నిహితంగా ఉంటానని ఆమె అన్నారు. నాకు కొంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని అయితే వాళ్లు కేవలం బాయ్ ఫ్రెండ్స్ మాత్రమేనని పెళ్లి,

రిలేషన్ షిప్ విషయంలో నాకు పెద్దగా నమ్మకం లేదని ఆమె కామెంట్లు చేశారు. రాబోయే మూడు సంవత్సరాలలో పాన్ వరల్డ్ స్టార్ కావాలని ఉంటుందని ఫరియా అబ్దుల్లా వెల్లడించారు. అన్ని భాషల్లో సినిమాలు చేయాలని భావిస్తానని ఆమె అన్నారు. ఫరియా అబ్దుల్లా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus