Faria Abdullah: ‘జాతిరత్నాలు’ బ్యూటీకి క్రేజీ ఛాన్స్!

‘జాతిరత్నాలు’ సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఫరియా అబ్దులా. ఈ సినిమాలో ఆమె చిట్టి అనే క్యారెక్టర్ లో కనిపించింది. ఇక అభిమానులంతా ఆమెని ముద్దుగా చిట్టి అని పిలవడం మొదలుపెట్టారు. మొదటి సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ.. ఈ బ్యూటీ సినిమా అవకాశాలు త్వరగా రాలేదు. రీసెంట్ గా మంచు విష్ణు నటిస్తోన్న ‘ఢీ’ సీక్వెల్ లో ఫరియాను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు.

ఇప్పుడు ఈ బ్యూటీకి మరో సినిమా అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ‘బంగార్రాజు’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇందులో స్పెషల్ సాంగ్ కోసం ఫరియాను ఎంపిక చేసుకున్నారట. సినిమాలో నాగార్జున ఆమె మాస్ స్టెప్పులు ఓ రేంజ్ లో ఉంటాయని చెబుతున్నారు. నిజానికి ఫరియా మంచి డాన్సర్. హిఫ్‌ హాప్, బీ బాయింగ్, బెల్లీ డాన్స్ లలో ఆమె ట్రైనింగ్ తీసుకుంది.

అందుకే ఈ సినిమాలో డాన్స్ నెంబర్ కోసం ఫరియాను ఫైనల్ చేసుకున్నారు. మొత్తానికి ఈ బ్యూటీ బంగార్రాజుతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మొదట వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus