ప్రముఖ కన్నడ సినీ నటుడు దివంగత పునీత్ రాజ్‌కుమార్ మరణించి సంవత్సరాలు గడుస్తున్నా ఆయనను అభిమానించే అభిమానుల హృదయాలలో మాత్రం ఆయన జీవించి ఉన్నారు. ఒక అభిమాని పునీత్ భావ చిత్రాన్ని వరిపైరు నడుమ ఆవిష్కరించగా అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. రైచూర్ జిల్లా ఢోణి బసవణ్ణ క్యాంప్ కు చెందిన రైతు కర్లి సత్యనారాయణకు ఆరు ఎకరాల పొలం ఉంది. రెండు ఎకరాల పొలంలో పునీత్ రాజ్ కుమార్ భావ చిత్రం మాదిరిగా వచ్చేలా వరి పైరును పండించి సత్యనారాయణ పునీత్ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు.
బాల్యం నుంచి తాను పునీత్ కు వీరాభిమానినని గోల్డెన్ రోజ్ మొక్కలను, 100 కిలోల వరి విత్తనాలను ఉపయోగించి పునీత్ భావచిత్రం వచ్చేలా చేశానని సత్యనారాయణ చెబుతున్నారు. పునీత్ రాజ్ కుమార్ భావచిత్రం కోసం రైతు మూడు లక్షల రూపాయలు ఖర్చు చేశారు. డ్రోన్ కెమెరా సహాయంతో పేరును అవసరమైన చోట కత్తిరించిన సత్యనారాయణ కాలువ నీరు రాకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి పంటను కాపాడుకున్నారు.
మొత్తం 400 చదరపు అడుగులు ఉండేలా కర్ణాటక రత్న అనే పదాన్ని పొందుపరిచి పునీత్ పై అభిమానాన్ని చాటుకున్నారు. పునీత్ రాజ్ కుమార్ అభిమానుల హృదయాలలో ఎప్పటికీ జీవించి ఉంటారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పునీత్ రాజ్ కుమార్ చేసిన సేవా కార్యక్రమాలను సైతం ఎవరూ సులువుగా మరిచిపోలేరు. కోట్ల రూపాయల పారితోషికాన్ని సేవా కార్యక్రమాల కోసం ఆయన ఖర్చు చేశారు.
వివాదాలకు దూరంగా ఉంటూ కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నారు. అభిమానులు పునీత్ ను ప్రేమగా అప్పు అని పిలుచుకుంటారు. టాలీవుడ్ కు చెందిన ఎంతోమంది స్టార్ హీరోలు సైతం (Puneeth Rajkumar) పునీత్ ను ఎంతగానో అభిమానిస్తారు.
గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు