పొట్టి నెలలోకి మారుతున్న స్టార్‌ సినిమాలు!

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల సినిమాలు విడుదల అవ్వడానికి సీజన్‌ అంటే… గుర్తొచ్చేవి సంక్రాంతి, వేసవి, దసరా, డిసెంబరు ఆఖరు. చాలా ఏళ్లుగా ఇదే నడుస్తూ వచ్చింది. అయితే వివిధ కారణాల వల్ల ఒక్కోసారి వేరే సమయాల్లో కూడా విడుదలవుతుంటాయి. అప్పుడు వాటిని ఆ సమయం ముందు సీజన్‌కు ఎక్స్‌టెన్షన్‌ అనుకోవచ్చు. అలా ఇప్పుడు పొట్టి నెల ఫిబ్రవరిని సంక్రాంతికి ఎక్స్‌టెన్షన్‌ అనుకోవచ్చు. అందుకే స్టార్‌ హీరోల సినిమాలు వరుస కడుతున్నాయి.

కరోనా సెకండ్‌ వేవ్‌ కాస్త తగ్గుముఖం పట్టగానే టాలీవుడ్‌లో సినిమాల విడుదల తేదీలు వరుస కట్టాయి. సంక్రాంతిని టార్గెట్‌ చేసుకొని రిలీజ్‌ డేట్లు చెప్పేశారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా మొత్తం పరిస్థితి మార్చేసింది. దీంతో మిగిలిన హీరోలు, దర్శకులు, నిర్మాతలు కొత్త తేదీలు వెతుకులాటలో పడ్డారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నెల బాగా పనికొస్తుంది అనుకుంటున్నారు. అలాగే రిలీజ్‌లు చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా ఫస్ట్‌ కమ్‌ ఫస్ట్‌ సర్వ్‌ పాలసీ వాడుతున్నారు.

సంక్రాంతికి రిలీజ్‌ చేస్తామంటూ ప్రకటించిన సినిమాల కంటే ముందే కొన్ని స్టార్‌ సినిమాలు సిద్ధమైపోయాయి. చివరి దశకొచ్చాయి కూడా. అయితే ఇంకా సగం సినిమా కూడా కాకముందే రిలీజ్‌ డేట్లు ప్రకటించేశారు. ‘భీమ్లా నాయక్‌’, ‘సర్కారు వారి పాట’ లాంటి సినిమాలు అలా అనౌన్స్‌ చేసినవే. దీంతో ఈ రెండు సినిమాలు మార్చి, ఏప్రిల్‌కి వెళ్లిపోతున్నాయని టాక్‌. ముందే సిద్ధమైన ‘ఆచార్య’, ఆఖరి దశలో ఉన్న ‘ఎఫ్‌ 3’ ఫిబ్రవరిలో వచ్చేస్తున్నాయి.

2022లో కొత్త తేదీలు చూసుకుంటే… ‘ఆచార్య’ను ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నారు. ఇక ‘ఎఫ్‌ 3’ని ఫిబ్రవరి 25న తీసుకొస్తారట. ఇక ‘భీమ్లా నాయక్‌’ ఏప్రిల్‌కి, ‘సర్కారు వారి పాట’ మార్చి నెలాఖరుకు జరుగుతున్నాయట. ‘రాధే శ్యామ్‌’ విషయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా చాలా రోజుల క్రితమే రెడీ అయ్యింది. ఇంకా ఇంట్లో ఉంచుకుంటే సమస్యే.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus